హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, మూసాపేట్, కేపీహెచ్‌బీ.. ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్‌లో వర్షం పడుతోంది. పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్.. ఐడీఏ బొల్లారం, గుమ్మడిదలలో కురుస్తోంది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. నిజాంసాహర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా నీట మునిగింది.
లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల ట్రాఫిక్ నిచిలిపోయింది. అటు మెదక్, సిద్దిపేట జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. హైవే మొత్తం నీటితో మునిగిపోయింది. రామాయంపేటలో పలు కాలనీల్లో నీరు నిలిచిపోయింది. అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..