Hyderabad: తెలంగాణకు నౌ కాస్ట్ వార్నింగ్.. రానున్న 3 గంటలు ఆ జిల్లాల్లో అల్లకల్లోలం.. హైదరాబాద్‌లో రోడ్లు జలమయం

|

Sep 20, 2021 | 8:01 PM

తెలంగాణకు రెయిన్ అలర్ట్ వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మరోసారి కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఉందని తెలిపారు.

Hyderabad: తెలంగాణకు నౌ కాస్ట్ వార్నింగ్.. రానున్న 3 గంటలు ఆ జిల్లాల్లో అల్లకల్లోలం.. హైదరాబాద్‌లో రోడ్లు జలమయం
Telangana Rains
Follow us on

తెలంగాణకు రెయిన్ అలర్ట్ వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మరోసారి కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఉందని తెలిపారు. రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టంచేశారు. తాజాగా వాతావరణ శాఖ నౌ కాస్ట్ వార్నింగ్ ఇచ్చింది.  రానున్న 3 గంటల్లో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్,సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస్తుందని హెచ్చరించింది. మునిసిపల్ కార్పొరేషన్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. పాతబస్తీ, రాజేంద్రనగర్‌ వంటి ప్రాంతాల్లో రహదారులు మొత్తం వర్షపునీటితో నిండిపోయాయి. నీళ్లు ఏటూ పోయేదారిలేక అక్కడే నిలిచిపోయాయి. నిలిచిన నీళ్లల్లో స్థానిక యువకులు.. ఈత కొడుతూ సరదా తీర్చుకుంటున్నారు. ప్రజెంట్‌ ఆ వీడియోస్ వైరల్‌గా మారాయి.

 

 

రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానిక ప్రజలు. రోడ్డుపై నీళ్లు నిలిచిపోవడంతో బైక్స్, కార్లు పాడయిపోయాయి. నిలిచిన నీటితో అంటురోగాలు వస్తాయని భయపడుతున్నారు. రోడ్డుపై నిలిచిపోయిన నీళ్లలోని రోడ్డూ గుండానే వెలుతూ.. తీవ్ర ఆవస్థలు పడుతున్నారు వాహనదారులు. స్థానికులు. పిల్లలతో కలిసి వెళ్లాలంటే భయమేస్తోదంటున్నారు స్థానికులు. నిత్యావసరాలకోసం, అత్యవసరంగా బయటికి వెళ్లాల్సిన సమయంలో భయ భయంగానే రోడ్డు దాటుతున్నారు. రోడ్డుపై నిలిచిపోయిన నీళ్లను వెంటనే తొలగించాలని వేడుకుంటున్నారు.

Also Read: Viral Video: తిరుమలలో వరాహాలు.. మూలికలు, ఆకులు ఎలా తింటున్నాయో చూడండి

పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు… ఆ రోజు నుంచే పనులు