Hyderabad: ‘నీకుందిరోయ్’.. మస్తాన్ సాయిని రౌండప్ చేసిన నార్సింగి పోలీసులు

|

Feb 14, 2025 | 5:09 PM

రాజ్‌తరుణ్‌, లావణ్య... మధ్యలో మస్తాన్‌సాయి. మలుపులు తిరుగుతున్న ఈ కేసులో మస్తాన్‌ సాయితో పోలీసులు నిజాలు చెప్పిస్తారా...? పోలీసుల ప్రశ్నలకు అతడి జవాబులేంటి...? డే-2 ఇన్వెస్టిగేషన్‌ ఎలా సాగుతోంది…? ఇప్పుడివే అంశాలు ఆసక్తికరంగా మారాయి. అతగాడి క్రైమ్ హిస్టరీ చిట్టా విప్పే వరకు పోలీసులు వదిలేలా కనిపించడం లేదు...

Hyderabad: నీకుందిరోయ్.. మస్తాన్ సాయిని రౌండప్ చేసిన నార్సింగి పోలీసులు
Mastan Sai
Follow us on

మస్తాన్‌సాయి కేసులో నార్సింగి పోలీసుల ఆట మొదలైంది…! చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మస్తాన్ సాయిని గురువారం కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గురువారం సైబర్ క్రైమ్, బ్లాక్ మెయిలింగ్ విషయాల్లో మస్తాన్‌సాయిని ప్రశ్నించిన పోలీసులు… శుక్రవారం లావణ్యపై హత్యాయత్నంతో పాటు హార్డ్‌డిస్క్‌లోని వీడియోలపై కొశ్చన్ చేస్తున్నారు.

మస్తాన్‌సాయి దర్టీ పిక్చర్‌ను బయటపెట్టిన చేసిన లావణ్య… గురువారం పెట్టిన ప్రెస్‌మీట్‌ పెట్టి మరోసారి మస్తాన్‌సాయి ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేసింది. మస్తాన్‌ ఫ్యామిలీ ఏ క్షణమైనా తనను చంపేయొచ్చని… తనకు ఏం జరిగినా మస్తాన్‌ ఫ్యామిలీదే బాధ్యత అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు… రాజ్‌తరుణ్‌పై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకుంటానంది లావణ్య. దీంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో…! మస్తాన్‌సాయి కస్టడీలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.

మస్తాన్‌సాయి.. సైకో అంటే ఎలా ఉంటాడో.. మనిషనేవాడు ఎలా ఉండకూడదో చెప్పడానికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌..! ఇప్పుడీ సైతాన్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి..! తన గుట్టు బయటపడుతుందని అనుమానం వస్తే కాళ్లబేరానికి వచ్చి సూసైడ్‌ చేసుకుంటానని బెదిరిస్తాడు..తెరవెనుక తనకు అడ్డొచ్చిన వాళ్లను చంపేందుకూ స్కెచ్చులు వేస్తాడు.. ఇలా ఎన్నో నమ్మలేని నిజాలు రిమాండ్‌ రిపోర్ట్‌లో ఉన్నాయి. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న మస్తాన్‌సాయిపై..డ్రగ్స్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. మస్తాన్‌సాయికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు..ఎండీఎంఏ డ్రగ్స్‌ సేవించినట్టు గుర్తించారు. దీంతో NDPS సెక్షన్ 27 కింద కేసు నమోదు చేశారు. అయితే మస్తాన్‌ సాయిపై గతంలో కూడా డ్రగ్స్‌ కేసులు నమోదయినట్టు చెబుతున్నారు పోలీసులు. దీంతో త్వరలో నార్కోటిక్ టీం కూడా అతడ్ని విచారించే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..