Kalady Sri Adi Shankara Madom: ఆదిశంకర మఠంలో శివరాత్రి కార్యక్రమాలు.. బుకింగ్ చేసుకోండిలా

శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కోవ్కూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో..

Kalady Sri Adi Shankara Madom: ఆదిశంకర మఠంలో శివరాత్రి కార్యక్రమాలు.. బుకింగ్ చేసుకోండిలా
Kaldya Shankara Madom

Updated on: Feb 25, 2025 | 2:07 PM

శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కోవ్కూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని.. పలు పూజా కార్యక్రమాలు చేయనున్నారు. శివ భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి 26న ఉదయం 6 గంటలకు గణపతి హోమం, 9 గంటలకు అభిషేకం.. అలాగే సాయంత్రం 6 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 8 గంటలకు అల్పాహారం జరగనున్నాయి. భక్తులు తమ ఫ్యామిలీతో సహా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాలడి శ్రీ ఆదిశంకర మఠం అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. డైరెక్ట్ పార్టిసిపేషన్‌కి రూ. 300 ఖర్చవుతుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా అయితే.. రూ. 101 అవుతుందని పేర్కొన్నారు. ఇక రిజిస్టర్ చేసుకోవాలనుకునేవారు ఈ లింక్ క్లిక్ చేయండి. https://kaladyshankaramadomts.org. ఏదైనా సహాయం కావాలంటే 8350903080కి ఫోన్ చేయవచ్చు అని ఆదిశంకరాచార్య మహాసంస్థానం పేర్కొంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి