
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పీఏ, అడ్వకేట్ సందీప్ రెడ్డి డబ్బు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆయన నుంచి రూ.10లక్షలు సీజ్ చేసిన గచ్చిబౌలి పోలీసులు, మూడు ల్యాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా గచ్చిబౌలి, ఎస్‌ఐఎన్ టవర్స్ దగ్గర సందీప్ రెడ్డి కారును ఆపారు పోలీసులు. అందులో తనిఖీలు చేయగా.. కీలక పత్రాలు బయటపడ్డాయి. నగదు కూడా ఉండటంతో వాహనం మొత్తాన్ని పరిశీలించారు. ఇందులో కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పోలీసులు గుర్తించారు. వాటిలో కోడ్ భాషలో లెక్కలు రాసుండటంతో.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటివరకు రూ.15కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. కాగా 2008నుంచి విశ్వేశ్వర్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు సందీప్ రెడ్డి. విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువైన సందీప్.. ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నింటిని చూస్తున్నారు.