Job Mela: నిరుద్యోగులకు శుభవార్త… ఖైరతబాద్‌లో నేడు జాబ్‌ మేళ.. పాల్గొననున్న 50 కంపెనీలు..

|

Feb 07, 2021 | 5:49 AM

Job Mela In Hyderabd: కరోనా కారణంగా ఉద్యోగ నియామకాల్లో వేగం తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ మొదలు పెట్టాయి. జాబ్‌ మేళాలు..

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త... ఖైరతబాద్‌లో నేడు జాబ్‌ మేళ.. పాల్గొననున్న 50 కంపెనీలు..
Follow us on

Job Mela In Hyderabd: కరోనా కారణంగా ఉద్యోగ నియామకాల్లో వేగం తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ మొదలు పెట్టాయి. జాబ్‌ మేళాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల టీసేవ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ మణికొండలో జాబ్‌ మేళ జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా పట్టణంలో మరో జాబ్‌ మేళ నేడు (ఆదివారం) జరుగుతోంది. ఆల్‌ ఇండియా స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ మైనార్టీస్‌ కమిటీ సౌజన్యంతో  ఖైరతాబాద్‌లోని వాసవి కళ్యాణ మండపంలో జాబ్‌ ఫెయిర్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్‌ మేళ జరగనుంది. నిరుద్యోగులకు కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిండానికే ఈ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఈ మేళాలో సుమారు 50 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇంటర్వ్యూల్లో సెలక్ట్‌ అయిన వారికి అప్పటికప్పుడు అడ్మిట్‌ కార్డ్‌ ఇస్తారు. ఈ కంపెనీలో కాగ్నిజెంట్‌, ఎల్‌ అండ్‌ టీ, నౌకరీ.కామ్‌, ఓజ్హా గ్రూప్‌, ఆక్వా టెక్‌ వంటి కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ఫెయిర్‌ హాజరయ్యే అభ్యర్థులు.. తమ విద్యార్హతల జిరాక్స్‌ కాపీలు, ఫొటోలు తీసుకురావాలని తెలిపారు. ఈ మేళాను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు.. పండగ.. సీఎం కేసీఆర్‌ కృషికి వారి సహకారం కావాలన్న మంత్రులు