AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాటర్ ప్యాకెట్ తీసుకుంటున్నారా..? వామ్మో.. ఇలాంటి కల్తీతో జాగ్రత్త

హైదరాబాద్‌లో కల్తీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ప్రతీ వస్తువును కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఏది నిజమైనదో.. ఏది నకిలీదో తెలుసుకోవడం కూడా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా మరో కల్తీ ముఠా గుట్టురట్టయింది. నీటి ప్యాకెట్ల కల్తీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

Hyderabad: వాటర్ ప్యాకెట్ తీసుకుంటున్నారా..? వామ్మో.. ఇలాంటి కల్తీతో జాగ్రత్త
Water
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 7:15 AM

Share

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలో కలుషిత నీటి ప్యాకెట్ల తయారీపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అక్రమంగా నడుస్తున్న వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్లపై మంగళవారం దాడులు నిర్వహించి భారీ స్థాయిలో అక్రమాలు వెలుగులోకి తెచ్చారు. సమాచారం మేరకు.. బాపునగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా నడుస్తున్న మూడు నీటి శుద్ధి కేంద్రాలపై అంబర్‌పేట టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీలించగా ప్యాకెట్లలో నింపుతున్న నీరు కలుషితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనారోగ్యకర పరిస్థితుల్లో యూనిట్లు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నట్లు వెల్లడైంది. దాడుల్లో పెద్ద ఎత్తున నీటి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

ఈ వ్యవహారంలో జబేర్, జావేద్, నయీం, జునైద్ అనే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ తరుణ్ కుమార్ మాట్లాడుతూ.. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అవసరమైన అనుమతులు లేకుండా ఇలాంటి యూనిట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు యూనిట్లను సీజ్ చేసి, మరిన్ని అనుమానాస్పద కేంద్రాలపై కూడా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. నగరంలో అక్రమంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి