
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి ముఖ్య విషయం తెలిపింది. మంజీరా ఫేజ్-2 లో ఏర్పడిన భారీ లీకేజీల కారణంగా నగరంలోని కీలక ప్రాంతాల్లో దాదాపు 40 గంటల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. మంజీరా ఫేజ్-2 సరఫరా లైన్‌లో భాగంగా కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు మీదుగా హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీమెయిన్ పైపులైన్‌కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీల వల్ల భారీగా నీరు వృధా అవుతుండటంతో జలమండలి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని నిర్ణయించింది.
11.02.2026 బుధవారం ఉదయం 6 గంటల నుండి. 12.02.2026 రాత్రి 10 గంటల వరకు నీటి సరఫరా బంద్ కానుంది.
మరమ్మత్తుల కారణంగా ఈ డివిజన్ల పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం జరుగుతుంది.
దాదాపు రెండు రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలగనుండటంతో జలమండలి అధికారులు కీలక సూచనలు చేశారు. నీటి సరఫరా పునరుద్ధరణ అయ్యే వరకు నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మరమ్మత్తు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న మియాపూర్, కూకట్‌పల్లి వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు ముందస్తుగా సిద్ధంగా ఉండటం మంచిది.