
హైదరాబాద్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులపై కొరడా ఝళిపించారు. వీకెండ్ జోష్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 48 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఓ మందు బాబు మాత్రం పోలీసులకు చుక్కలు చూపించాడు. మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తున్న అతన్ని కారు దిగమంటే దిగక పోగా.. ఠారెత్తించాడు. చివరికి బీరు సీసాతో కారు దిగి పోలీసుల ముందే తాగుతూ హల్ చల్ చేస్తూ.. వారితో వాగ్వాదానికి దిగాడు. ఇక మరో వ్యక్తి పోలీసులు చేపడుతున్న తనిఖీలను గమనించి కారు రివర్స్ చేయబోయి.. డివైడర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కారు డ్యామేజ్ అయ్యింది.