Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రలు.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

హైదరాబాద్‌లోని వాహనదారులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. బంజారాహిల్స్ జగన్నాథ ఆలయం ఆధ్వర్యంలో జరగనున్న జగన్నాథ రథయాత్రల సందర్భంగా గురువారం జూలై 16న నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.వాహనదారులకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు.

Jagannath Rath Yatra: హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రలు.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
Jagannath Rath Yatra Hyderabad

Updated on: Jul 16, 2026 | 12:30 PM

హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. బంజారాహిల్స్ జగన్నాథ ఆలయం ఆధ్వర్యంలో జరగున్న జగన్నాథ రథయాత్రల సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు విధిస్తున్నట్టు తెలిపారు. మొదటి రథయాత్ర ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం నుండి ప్రారంభమై.. అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్ బాగ్, గన్ ఫౌండ్రీ, అబిడ్స్, కోటి, మలకంట మీదుగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుందని.. రెండవ రథయాత్ర బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని జగన్నాథ ఆలయం నుండి మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ రథయాత్రల నేపథ్యంలో ఈ కింద్రి మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుదని తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపులు – ప్రత్యామ్నాయ మార్గాలు

మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ నుండి ఫిల్మ్ నగర్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను.. రోడ్ నెం. 1, రోడ్ నెం. 10, జహీర్ నగర్, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు మళ్లిస్తారు. కాబట్టి వాహనదారులు ఏసీబీ ఆఫీస్ బై-లేన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా హాస్పిటల్, అపోలో జంక్షన్ మార్గాన్ని గుండా కూడా వెళ్లవచ్చని తెలిపారు.

అదేవిధంగా, షేక్‌పేట్, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, మాదాపూర్, హైటెక్ సిటీల నుండి రోడ్ నెం. 12 వైపు వచ్చే వాహనాలను.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెం. 10, జహీర్ నగర్, రోడ్ నెం. 1 మీదుగా మళ్లిస్తారు. కాబట్టి వాహనదారులకు ఈ ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us