Hyderabad: ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు.. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ అలర్ట్..

హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ అలర్ట్. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ట్రాఫిక్‌కు సంబంధించి పోలీసులు కీలక అలర్ట్ చేశారు. ఈ మేరకు కంపెనీలు, విద్యాసంస్థలకు కీలక సూచనలు ఇచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని, విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించారు.

Hyderabad: ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు.. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ అలర్ట్..
Hyderabad

Updated on: Sep 18, 2026 | 8:47 AM

హైదరాబాద్ ప్రజలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. గణేష్ నిమజ్జనాల సందర్బంగా నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతుండగా.. పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా అన్ని కంపెనీలు, విద్యా సంస్థలకు కీలక సూచనలు జారీ చేసింది. కంపెనీలు, విద్యాసంస్థలు సాయంత్రం త్వరగా మూసివేయాలని సూచించింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత లాగౌట్ చేయాలని సూచనలు జారీ చేసింది. 25వ తేదీ వరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రోత్సహించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపాయి. దీని వల్ల రోడ్లపై రద్దీ తగ్గుతుందని, ప్రజలకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.

స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు ఆన్ లైన్, వర్చువల్ క్లాస్ విధానాలను 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పాటించాలని పోలీసులు సూచించారు. దీని వల్ల ప్రయాణానికి సంబంధించి ఇబ్బందులు తగ్గుతాయని, పిల్లలకు అసౌకర్యం కలగదని తెలిపింది. గణేష్ నిమర్జనంతో పాటు రాబోయే ఐదు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వర్షాలు పడితే రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగుతుంది. దీని వల్ల వాహనదారులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆఫీసులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని, విద్యాసంస్థలకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించింది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని, రోడ్లపై రద్దీ తగ్గుతుందని స్పష్టం చేసింది. ప్రజలందరూ దీనిని అర్థం చేసుకుని సహకరించాలని సూచించింది. గణేష్ నిమజ్జనాలు, వర్షాల క్రమంలో ట్రాఫిక్ ఫ్లోను తగ్గించేందుకు తమకు సహకరించాలని కోరింది.

కాగా హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. డప్పులు, డీజేలతో గణనాధులను నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఈ సారి వినాయక చవితికి నగరంలో భారీగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రతీ వీధిలోనూ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. రోడ్ల మధ్యలో ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us