AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఫోటో ఓపెన్ చేయగా బిత్తరపోయాడు

హైదరాబాద్ నగరంలో ఒక వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం దొంగతనానికి గురైన తన స్కూటర్ తిరిగి దొరుకుతుందని ఆ యజమాని అనుకోలేదు.. కానీ దొంగ చేసిన ఒక చిన్న తప్పు, ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు ఆ వాహనం చిక్కేలా చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఫోటో ఓపెన్ చేయగా బిత్తరపోయాడు
Representative Image
Ravi Kiran
|

Updated on: Apr 10, 2026 | 5:16 PM

Share

హైదరాబాద్ నివాసి మూడు నెలల క్రితం తన స్కూటర్ దొంగతనానికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, వాహనం జాడ దొరకలేదు. అయితే, ఇటీవల సదరు బాధితుడి మొబైల్ ఫోన్‌కు వరుసగా ట్రాఫిక్ చలాన్ల మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. తన వద్ద లేని వాహనానికి చలాన్లు ఎలా వస్తున్నాయని ఆశ్చర్యపోయిన యజమాని, ఆ చలాన్ వివరాలను చెక్ చేయగా దెబ్బకు షాక్ అయ్యాడు. ట్రాఫిక్ చలాన్లలో ఉన్న ఫోటోను గమనించగా, ఒక వ్యక్తి తన దొంగతనానికి గురైన స్కూటర్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ ఫోటోల్లోని ప్రదేశం, సమయాన్ని బట్టి బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. నిఘా కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తి తరచుగా ప్రయాణించే మార్గాలను పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో నిఘా పెంచిన పోలీసులు, చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది చదవండి: ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును ఈజీగా వలవొచ్చు..

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, వాహనదారులు తమ వాహనాలపై వచ్చే చలాన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు. నిఘా కెమెరాల ఏర్పాటు వల్ల నేరగాళ్లను పట్టుకోవడం సులభతరమవుతోందని వెల్లడించారు. దొంగిలించిన వాహనాన్ని యథేచ్ఛగా వాడుతున్న నిందితుడు, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడంతోనే పట్టుబడటం విశేషం. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని బాధితుడికి అప్పగించే ప్రక్రియను చేపట్టారు. కాగా, గతంలో వాహనం పోతే దొరకడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నగరవ్యాప్తంగా ఉన్న నిఘా వ్యవస్థ, ఆటోమేటిక్ చలాన్ల ప్రక్రియ నేర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇది చదవండి: పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?