AC Helmet: హెల్మెట్ ధరించడం భద్రతకు భరోసా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ నడిపించేప్పుడు, నిర్మాణ స్థలాల్లో పనిచేసే సమయంలో హెల్మెట్‌ను ఉపయోగించడం వల్ల పెను ప్రమాదాలు తప్పుతుంటాయి. హెల్మెట్ ప్రాణాలను కాపాడినట్లు వచ్చిన వార్తలను మనం చదివే ఉంటాం. అయితే చాలా మంది హెల్మెట్‌ను ధరించడానికి ఆసక్తి చూపించరు. హెల్మెట్‌ను ధరించినప్పుడు వచ్చే వేడే దీనికి కారణం. సరిగా గాలి తగలకపోవడం వల్ల తలపై చమట పడుతుంది.. ఇది చుండ్రు, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఈ కారణంగానే చాలా మంది హెల్మెట్‌ను ధరించడానికి ఇష్టపడరు.
ఈ సమస్యకు చెక్ పెట్టడానికే హైదరాబాద్‌కు చెందిన కొందరు కుర్రాళ్లు వినూత్న హెల్మెట్‌ను రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘జర్ష్ సేష్టీ’ ఈ హెల్మెట్‌ను రూపొందించింది. నగరానికి చెందిన కౌస్తుభ్ కౌండిన్య, శ్రీకాంత్ కొమ్ముల, ఆనంద్ కుమార్ అనే ముగ్గురు యువకులు ఏసీ హెల్మెట్‌ను రూపొందించారు. ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్‌గా పేరు తెచ్చుకున్న ఈ హెల్మెట్‌ను తాజాగా దుబాయ్‌లో జరుగుతోన్న ‘ఎక్సో్ 2020 దుబాయ్’లో ఆవిష్కరించారు. ఈ హెల్మెట్ ధరించడం వల్ల ఎలాంటి చిరాకు ఉండదు. పైనుంచి తల కూల్‌గా ఉంటుంది.
హెల్మెట్‌లో 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా రూపొందించారు. ఏసీ హెల్మెట్ ధర మోడళ్లను బట్టి రూ. 6 నుంచి రూ. 10 వేల వరకు ఉండనుంది. జర్ష్ సేఫ్టీ వెబ్‌సైట్‌లో ఈ హెల్మెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ హెల్మెట్ ద్వారా ఓవైపు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రాణాలకు సైతం రక్షణ కలిగిస్తుంది.
Also Read: Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్‌ను జంతువులతో పోల్చిన సన్నీ.. ఎవరెవరికి ఏమిచ్చాడంటే..
PM Modi: రైల్వే ప్రయాణికులకు పీఎం మోడీ గుడ్ న్యూస్.. మరో 200 స్టేషన్‌లలో ఆ సదుపాయాలు..