Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..

|

Sep 20, 2021 | 4:01 PM

ఆర్ధిక నేరాల చిట్టాలో మూడో స్థానం ఆక్రమించింది హైదరాబాద్. 2020 సంవత్సరానికిగానూ .. 20 లక్షలకు పైగా జనాభా గల 19 నగరాల గణాంకాలు బయటకు తీసింది NCRB.. వీటిలో థార్డ్ ప్లేస్ ఆక్యుపై చేసింది హైదరాబాద్.

Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై  ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..
Financial Crimes In Hyderab
Follow us on

ఆర్ధిక నేరాల చిట్టాలో మూడో స్థానం ఆక్రమించింది హైదరాబాద్. 2020 సంవత్సరానికిగానూ .. 20 లక్షలకు పైగా జనాభా గల 19 నగరాల గణాంకాలు బయటకు తీసింది NCRB.. వీటిలో థార్డ్ ప్లేస్ ఆక్యుపై చేసింది హైదరాబాద్. మొత్తం 3427 కేసులతో ఈ ర్యాంకు సాధించింది హైరదాబాద్. ఢిల్లీ, ముంబై నగరాలు మొదటి, రెండో స్థానాల్లో ఉండటం విశేషం. మరీ ముఖ్యంగా ఢిల్లీ 4,445 కేసులతో టాప్ ప్లేస్ లో ఉండగా.. 3,927 కేసులతో ముంబై రెండో స్థానంలో నిలిచింది. ఇంతకీ హైదరాబాద్ లో ఎలాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి? ఆ కేసుల వివరాలు ఏంటని ఆరా తీయగా.. 1,366 కేసులు బ్యాంకు మోసాలకు సంబంధించినవే ఉన్నాయి. మిగిలిన వాటిలో ఫోర్జరీ, చీటింగ్ కేసులున్నట్టుగా చెబుతున్నాయి రికార్డులు.

హైదరాబాద్ లో బ్యాంకు ఫ్రాడ్స్ 1366 గా ఉంది. ఫోర్జరీ, చీటింగ్ వంటి కేసులు తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ ఆక్రమించడానికి కారణమైన నేరాలు- వాటి స్వభావాలు ఎలాంటివని చూస్తే.. దొంగ హౌసింగ్ స్కీములకు ఢిల్లీ వాసులు ఎక్కువగా బుక్ అవుతున్నట్టు NCRB క్రైమ్ సమాచార్ చెబుతోంది. ఇంకా.. చిట్ ఫండ్ స్కాములు, ప్రాపర్టీ చీటింగ్ కేసులు అధికంగా నమోదైనట్టు చెబుతున్నాయి లెక్కలు.

ఇక్కడ మరో విచిత్రమేంటంటే.. సైబర్ నేరాలు ఏకంగా 86 శాతం పెరిగినట్టు గుర్తించింది NCRB. లాక్ డౌన్ సందర్భంగా ఈ సంఖ్య తగ్గాల్సింది పోయి.. మరింత పెరిగినట్టు గుర్తించారు అధికారులు. కాబట్టి ఇలాంటి నేరాల పట్ల జాగ్రత్త అంటున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..