Hyderabad: సెల్‌ఫోన్ల రికవరీలో పోలీసుల దూకుడు.. 67 మొబైల్స్‌ను యజమానులకు అందజేత!

హైదరాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో దొంగలించబడి, పోయిన మొబైల్‌ ఫోన్లను రికవరీ చేయడంలో హైదరాబాద్‌ పోలీసులు మరోసారి విజయం సాధించారు. సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (CEIR) పోర్టల్‌ సాయంతో పోయిన మొత్తం 67 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు.. ఫోన్ల ట్రాకింగ్ బంజారాహిల్స్ డివిజన్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో వాటిని యజమానులకు అధికారికంగా అప్పగించారు.

Hyderabad: సెల్‌ఫోన్ల రికవరీలో పోలీసుల దూకుడు.. 67 మొబైల్స్‌ను యజమానులకు అందజేత!
Hyderabad

Edited By: Anand T

Updated on: Jul 12, 2025 | 9:28 PM

హైదరాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో దొంగలించబడి, పోయిన మొబైల్‌ ఫోన్లను రికవరీ చేయడంలో హైదరాబాద్‌ పోలీసులు మరోసారి విజయం సాధించారు. సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (CEIR) పోర్టల్‌ సాయంతో పోయిన మొత్తం 67 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు.. ఫోన్ల ట్రాకింగ్ బంజారాహిల్స్ డివిజన్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో వాటిని యజమానులకు అధికారికంగా అప్పగించారు.

విభాగాల వారీగా గుర్తించిన మొబైల్‌ ఫోన్ల వివరాలు..

1. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ – 19 మొబైళ్లను గుర్తింపు
2. మసాబ్‌టాంక్ పోలీస్ స్టేషన్ – 17 మొబైళ్లు
3. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ – 22 మొబైళ్లు
4. ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ – 9 మొబైళ్లు

ఈ ఫోన్లను తిరిగి పొందడంలో CEIR పోర్టల్ కీలక పాత్ర పోషించింది. ఇది భారత టెలికమ్యూనికేషన్ శాఖ అభివృద్ధి చేసిన కేంద్రికృత సిస్టమ్. ప్రతి మొబైల్‌కు ఉండే IMEI నంబర్ ద్వారా పోయిన లేదా దొంగిలించిన ఫోన్లను బ్లాక్ చేసి, ట్రేస్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ తిరిగి పొందిన ఫోన్లు IMEI ట్రాకింగ్, టెక్నికల్ అనాలసిస్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ల ఆధారంగా గుర్తించారు. టెలికాం సేవా సంస్థలతో సమన్వయం చేసుకోవడం ద్వారా ఫలితాన్ని సాధించగలిగారు.

హైదరాబాద్‌ నగర పోలీస్ శాఖ ఇటీవల నుంచే పోయిన మొబైల్‌ ఫోన్లను తిరిగి పొందేందుకు ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇప్పటికే అనేక మొబైళ్లు బాధితులకు అందజేస్తూ, ప్రజలకు అసలైన పోలిసింగ్ అంటే ఏంటో చూపిస్తోంది. మీ మొబైల్ పోయినట్లయితే వెంటనే మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని.. అలాగే www.ceir.gov.in పోర్టల్ ద్వారా సమాచారం నమోదు చేయాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.