
హైదరాబాద్ , ఏప్రిల్ 18: హైదరాబాద్ చాంద్రాయగుట్ట పోలీసులు ఏటీఎం సెంటర్లపై దృష్టి సారించి దొంగతనాలకు పాల్పడుతున్న అబ్దుల్లా ఒబైద్ అల్ కతేరిని అరెస్ట్ చేశారు. ATMల వద్ద డబ్బు డిపాజిట్ చేసే వారిని టార్గెట్ చేసుకుని, PhonePe ద్వారా డబ్బు పంపుతున్నట్లు నమ్మించి నకిలీ స్క్రీన్‌షాట్‌లు చూపించి నగదు దోచుకునేవాడు. నాలుగు కేసుల్లో మొత్తం రూ.46 వేల మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద రూ.10 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో అదే ATM వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. హైదరాబాద్‌లో ATM సెంటర్లు కేంద్రంగా ‘అటెన్షన్ డైవర్షన్’ మోసాలు పెరుగుతున్నాయి. ఇలాంటి ట్రిక్‌లతో ప్రజలను మోసం చేసే దొంగలు తాజాగా బయటపడ్డారు.
ఈ మోసాలు ATMల వద్ద రష్ hours లో ఎక్కువగా జరుగుతాయి. నిందితులు UPI ట్రాన్సాక్షన్‌ల స్క్రీన్‌షాట్‌లను ఎడిట్ చేసి, ‘నెట్‌వర్క్ సమస్య’ అని చెప్పి నగదు తీసుకుంటారు. పోలీసులు ప్రజలకు యాప్ప్‌లో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసుకోవాలని, అన్‌నోన్ వ్యక్తులతో ఇలాంటి డీల్స్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.