Hyderabad: హైదరాబాద్ నగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న కృష్ణ ఫేజ్ 1, 2, 3 పంపింగ్ స్టేషన్లకు నిరంతరాయం విద్యుత్ సరఫరా చేసే 132కేవీ బల్క్ ఫీడర్ల పొటెన్సియల్ ట్రాన్స్‌ఫార్మర్(పీటీ) కాలిపోయింది. దాంతో గొడకండ్ల పంపింగ్ స్టేషన్‌లో అన్ని పంపులు ఆగిపోయాయి. దీనికి కారణంగా ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపాదికన మరమ్మత్తు పనులు జరుగుతున్నా.. నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని చెబుతున్నారు అధికారులు. పనులు పూర్తి కాగానే యధావిధిగా నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని తెలిపారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే..
సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మన్ ఘడ్, యాకుత్పుర, మహబూబ్ మాన్షన్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్ మెట్, శివమ్ రోడ్, చిల్కలగూడ, రియాసత్‌నగర్, అలియాబాద్, మిరాలం, బిఎన్. రెడ్డి నగర్,ఆటో నగర్, వనస్థలిపురం, మారుతీ నగర్, ఏలుగుట్ట, హబ్సిగూడ, నాచారం, బోడుప్పల్, తార్నాక, లాలాపేట్, మారేడ్ పల్లి, కంటోన్మెంట్, ఎమ్ఈఎస్, ప్రకాష్ నగర్, మేకల మండి, బాలాపూర్, మైసారం, సాహెబ్ నగర్, మైలార్ దేవ్ పల్లి, బండ్ల గూడ, పీడీపీ, గోల్డెన్ హైట్స్, సులేమాన్ నగర్, 9 నెంబర్ భోజగుట్ట, ఆళ్ళ బండ, గంధం గూడ, ఆసిఫ్ నగర్, ప్రశ్సన్ నగర్, మాదాపూర్, షేక్ పేట్ రిజర్వాయర్ ప్రాంతాలు.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని హైదరాబాద్ వాటర్ బోర్టు అధికారులు కోరారు.
Also read:
Viral Video: డ్రైవర్ సాబ్ ఎంత పని చేశావయ్యా.. రిజర్వాయర్‌లో స్విమ్మింగ్ చేసిన కారు..!
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. రాబోయే మూడు రోజులు..
Andhra Pradesh: పూజారితో తన్నించుకునేందుకు బారులు తీరిన భక్తులు.. ఆ ఆలయ ప్రత్యేకతే వేరు..!