Meerpet Case: హైదరాబాద్‌ పోలీసులకు సవాల్‌గా మీర్‌పేట్‌ మర్డర్‌ కేసు

కిరాతక హత్య.. కాదు కాదు.. అంతకుమించి.. ఎస్‌.. మీర్‌పేట్‌ మర్డర్‌ కేసు ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ మహిళ హత్య హైదరాబాద్‌ పోలీసులకే సవాల్‌ విసురుతోంది. చంపింది.. కాల్చింది.. చెరువులో పడేసింది నిజం.. నిందితుడు కూడా ఒప్పుకుంటున్నాడు.. కానీ.. ఎవిడెన్స్‌లు లేకుండా చేయడం పోలీసులకు ఛాలెంజ్‌గా మారుతోంది. ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ కేసును పోలీసులు ఎలా చేధిస్తారనేది ఆసక్తి రేపుతోంది.

Meerpet Case: హైదరాబాద్‌ పోలీసులకు సవాల్‌గా మీర్‌పేట్‌ మర్డర్‌ కేసు
Meerpet Incident

Updated on: Jan 24, 2025 | 9:51 PM

హైదరాబాద్‌ మీర్‌పేట్‌ మాధవి మర్డర్ కేసు ఇప్పుడు హైదరాబాద్‌ పోలీసుల సత్తాకే సవాల్‌గా మారుతోంది. నిందితుడు గురుమూర్తి.. తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నప్పటికీ.. మర్డర్‌ను నిరూపించడం ఎలా అనే దానిపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళను హత్య చేసి కాల్చి.. ఎముకలను పొడి చేసి.. చెరువులో పడేయడంతో ఆనవాళ్లు దొరక్కుండాపోయాయి. దాంతో.. కేవలం టెక్నికల్‌ ఎవిడెన్సెస్‌ ఆధారంగానే మీర్‌పేట్‌ కేసును చేధించాల్సి వస్తోంది. ఆ దిశగానే హైదరాబాద్‌ పోలీసులు అడుగులు వేస్తున్నారు. మూడు రోజుల దర్యాప్తు తర్వాత కిచెన్‌లో రెండు కీలక ఆధారాలు సేకరించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లతోపాటు.. ఇన్‌ఫ్రారెడ్ రేస్‌ ద్వారా ఇంట్లో రక్తపు మరకలు గుర్తించారు. వాటినుంచి డీఎన్‌ఏ శాంపిల్స్‌ సేకరించిన పోలీసులు.. పిల్లల డీఎన్‌ఏతో టెస్ట్ చేయబోతున్నారు.

అదే సమయంలో.. గతంలో ఎన్నడూ ఇలాంటి మర్డర్‌ జరిగిన దాఖలాలు లేకపోవడంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి హత్యలు ఎక్కడైనా జరిగాయా?.. అక్కడి పోలీసులు, అధికారులు ఎలా చేధించారనేదానిపై ఫోకస్‌ పెట్టారు. టెక్నికల్‌ అంశాల నేపథ్యంలో మీర్‌పేట్‌ మర్డర్‌ కేసు దర్యాప్తు కోసం పొరుగు రాష్ట్రాల నిపుణులు పిలవబోతున్నారు. ఇప్పటికే హత్య జరిగిన తీరుపై కొంత క్లారిటీకి వచ్చిన పోలీసులు.. పూర్తిగా టెక్నికల్‌ అంశాలతో ముడిపడి ఉండడంతో పొరుగు రాష్ట్రాల ఎక్స్‌పర్ట్స్ సాయంతో ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..