హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ప్రయాణికుల కోసం ఓ బంపరాఫర్‌ను అందిస్తోంది. పండుగ నేపథ్యంలో సెలవులు ఉన్న క్రమంలో ప్రయాణికులు పట్టణంలో మెట్రో ప్రయాణించేందుకు ఓ మంచి ఆఫర్‌ను అందిస్తోంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో పండుగ కానుకగా మూడు రోజులపాటు పాటు అన్‌లిమిటెడ్‌గా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా ప్రయాణికులు సింగిల్ రీఛార్జ్‌తో మెట్రోలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అన్‌లిమిటెడ్‌గా ప్రయాణించవచ్చు. ఇందుకోసం ప్రయాణికులు రూ. 59లో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సూపర్ సేవర్ కార్డ్ పేరుతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర ప్రజలంతా పల్లె బాట దారి పట్టారు. పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవులు ఉన్న నేపథ్యంలో అంతా గ్రామాలకు పయణమయ్యారు. దీంతో హైదరాబాద్ రోడ్లన్నీ బోసి పోయి ఉన్నాయి. ఈ క్రమంలోనే మెట్రో ప్రయాణికులకు సూపర్ సేవర్ కార్డు పేరుతో ఓ ఆఫర్‌ను అందిస్తోంది.
ఇందులో భాగంగా రూ. 59తో రీఛార్జ్ చేసుకొని రోజంతా నగరంలో మెట్రోలో అపరిమితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ నెల 13,14,15 తేదీల్లో మాత్రమే ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. మెట్రో స్టేషన్‌లోని కౌంటర్ల వద్ద ప్రయాణికులు ఈ కార్డులను పొందొచ్చు. అయితే ఇప్పటికే మెట్రో కార్డు ఉన్న వారు రూ. 59తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా కొత్తగా కార్డు తీసుకోవాలనుకునే వారు మాత్రం రూ. 109 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..