Hyderabad Metro: గుడ్ న్యూస్.. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు..

|

Sep 15, 2024 | 7:06 PM

గణేష్ నిమజ్జనం శోభాయాత్రలకు హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఎల్లుండి మంగళవారం రోజు జరిగే వినాయక నిమజ్జనం, శోభాయాత్ర వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాట్లు చేస్తోంది. గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Hyderabad Metro: గుడ్ న్యూస్.. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు..
Hyderabad Metro
Follow us on

గణేష్ నిమజ్జనం శోభాయాత్రలకు హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఎల్లుండి మంగళవారం రోజు జరిగే వినాయక నిమజ్జనం, శోభాయాత్ర వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ఏర్పాట్లు చేస్తోంది. గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ ఆదివారం వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోని చివరి స్టేషన్‌ ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుందని వెల్లడించింది.. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని పేర్కొంది. కాగా.. ఖైరతాబాద్‌ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ను 94వేల మంది ప్రయాణికులు వినియోగించుకున్నట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ వెల్లడించింది.

ఖైరతాబాద్‌ మహాగణపతికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం కావడం, నిమజ్జనం దగ్గర పడటంతో… బడా గణేషుని దర్శించుకునేందుకు సిటీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ఇవాళ అర్ధరాత్రి వరకు దర్శనాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇవాళ కూడా మెట్రో స్టేషన్లు రద్దీగా కనిపిస్తున్నాయి.

మరోవైపు ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో… ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు పోలీసులు. ఇక రేపు మధ్యాహ్నం నుంచి నిమజ్జన ఏర్పాట్లు చేయనున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..