హైదరాబాద్ ఈ పేరుకు ఒక బ్రాండ్ ఉంది. చారిత్రక కట్టడాలకు, వందల ఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం మన భాగ్యనగరం. కేవలం చరిత్రకు ఆనవాలైన నిర్మాణాలతోనే కాకుండా వంటకాలతోనూ హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచానికి చాటింది. కేవలం నగరానికే పరిమితమైన ఎన్నో వంటకాలు ప్రపంచఖ్యాతిని గడించాయి. హలీమ్ మొదలు బిర్యానీ వరకు ఎన్నో రకాల వంటకాలకు హైదరాబాద్ పెట్టింది పేరు.
హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో కరాచీ బేకరీ ఒకటి. దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ బేకరీకి ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ గుర్తింపు లభించిది. కరాచీ బేకరీలో లభించే ఫ్రూట్ బిస్కెట్స్‌కు ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ డెజర్ట్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా 150 అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ ప్రదేశాలలో టేస్ట్ అట్లాస్ జాబితాలో స్థానం సంపాదించుకోవడం విశేషం. టేస్ట్ అట్లాస్ ప్రపంచవ్యాప్తంగా 29వ అత్యుత్తమ డెజర్ట్‌గా కరాచీ బేకరీ ఫ్రూట్ బిస్కెట్‌లను ర్యాంక్ చేసింది.
ఈ విషయాన్ని కరాచీ బేకరీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. సిగ్నేచర్ ప్రొడక్ట్‌గా ఈ బిస్కెట్‌లకు ప్రత్యేక స్థానం ఉందని కరాచీ బేకరీ ప్రకటించింది. ఈ బిస్కెట్లు క్యాండీడ్ ఫ్రూట్‌తో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయని కరాచీ బేకరీ తెలిపింది. కరాచీ బేకరీతో పాటు భారత్‌కు చెందిన మరో తొమ్మిది ఫుడ్ ఐటెమ్స్‌కు సైతం గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 150 అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ ప్రదేశాల జాబితాలో ఎంపికైన భారత్‌కు చెందిన ఫుడ్ ఐటమ్స్ ఏవంటే..
పుణేలోని కయానీ బేకరీ 18వ స్థానంలో నిలవగా, కోలక్‌తాలోని కెసిదాస్ 25వ స్థానంలో నిలిచింది. ఇక కోల్‌కతాలోని ఫ్లూరీస్ 26వ స్థానం, కోల్‌కతాలోని బలరామ్ ముల్లిక్ అండ్ రాధారామన్ ముల్లిక్ 37వ స్థానం సంపాదించుకుంది. అలాగే ముంబైకి చెందిన కె రుస్తోమ్ అండ్ కో 49వ స్థానంలో నిలవగా, న్యూఢిల్లీలోని కురేమల్స్ కుల్ఫీకి 67, లక్నోలోని ప్రకాష్ మషూర్ కుల్ఫీకి 77వ స్థానం, పుణేలోని చితాలే బంధుకు 85 స్థానం, న్యూఢిల్లీలోని జలేబీ వాలాకు 93వ స్థానం దక్కింది.
Ladies and gentlemen, the 150 most legendary dessert places in the world & their iconic desserts. Save this link, there aren’t many more important lists you’ll come across in life: https://t.co/tWAkslvZRL pic.twitter.com/gzFywqp4gE
— TasteAtlas (@TasteAtlas) September 13, 2023
కరాచీ బేకరీని హైదరాబాద్‌లో 1953లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు నగరమంతా శాఖలు విస్తరించాయి కానీ కరాచీ బేకరీ తొలిసారి మోజామ్ జాహీ మార్కెట్‌లో ప్రారంభించారు. కాలక్రమేణ నగరమంతా విస్తరించడంతో పాటు దేశమంతా బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో కరాచీ బేకరీ విస్తరించింది. ఇక కరాచీ బేకరీ ప్రస్థానం కేవలం భారత్‌కే పరిమితం కాలేదు విదేశాల్లోనూ బ్రాంచ్‌లు ఏర్పాటయ్యాయి. అమెరికా, కెనడా, యూరప్, ఆస్ట్రేలియాకు సైతం కరాచీ బేకరీ ప్రొడక్ట్స్ ఎగుమతి అవుతున్నాయంటే ఈ బేకరీ ఫుడ్‌కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..