Hyderabad: చేపలు పట్టేందుకని చెరువుకు వెళ్లారు.. నీటిలో దిగిన కాసేపటికే

హైదరాబాద్‌ నగరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఆదివారం వీకెండ్ కావడంతో హిమాయత్‌సాగర్‌లో సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు ఓ యువకుడిని కాపాడగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నిపింది.

Hyderabad: చేపలు పట్టేందుకని చెరువుకు వెళ్లారు.. నీటిలో దిగిన కాసేపటికే
Himayat Sagar Accident

Edited By:

Updated on: Apr 26, 2026 | 8:11 PM

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వీకెండ్ సందర్భంగా ముగ్గురు స్నేహితులు సరదాగా హిమాయత్‌సాగర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే చేపలు పట్టుకున్న తర్వాత కొంతసేపటికి ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో ముగినిపోయారు. అది గమనించిన స్థానికులు ఓ యువకుడిని రక్షించగా.. మిగతా ఇద్దరు అప్పటికే నీట ముగిని ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. ఇక చనిపోయిన ఇద్దరు యువకులు హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్, షాహెబాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాంతాల్లో ఈత కొట్టేందుకని, చేపల కోసమని వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయినా జనాలు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూనే ఉన్నారు. కాబట్టి పిల్లలపై పేరెంట్స్ నిఘా ఉంచాలని, లోతైన జలాశయాల్లో ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండేలా చూడాని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us