వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్(Meru International School).. వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించింది. రెడ్ క్రాస్ సొసైటీతో కలిపి స్కూల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్ లో 53 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 11,12 తరగతుల విద్యార్థులే ఈ క్యాంప్ ను నిర్వహించారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు రక్తదానం ఆవశ్యకతను వివరించారు. సమాజ శ్రేయస్సు కోసం మేరు సంస్థ ఎప్పుడూ ఆలోచిస్తుందని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ జూపల్లి మేఘనారావు అన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి తమ విద్యాసంస్థ వేదిక అవడం సంతోషంగా ఉందని చెప్పారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.