Hyderabad: మూడు నెలల ముందు పోయిన బైక్‌కు వచ్చిన చలానా.. ఫోటో చూడగా కళ్లు తేలేశాడు

హైదరాబాద్‌లో బైక్ దొంగతనానికి గురైన మూడు నెలలకు వచ్చిన ఈ-చలానాలో దొంగ ఫోటో స్పష్టంగా కనిపించింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బాధితుడు, నిందితుడిని పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నాడు. ఆ సంఘటన ఏంటి.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకోండి. వివరాలు ఇలా..

Hyderabad: మూడు నెలల ముందు పోయిన బైక్‌కు వచ్చిన చలానా.. ఫోటో చూడగా కళ్లు తేలేశాడు
Hyderabad

Updated on: Apr 08, 2026 | 6:05 PM

హైదరాబాద్ నివాసి ఫైసల్ రెహ్మాన్ తన బైక్ దొంగతనానికి గురవ్వడంతో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, మూడు నెలలైనా బైక్ ఆచూకీ లభించలేదు. అయితే, అనూహ్యంగా అతడి మొబైల్‌కు ఒక ట్రాఫిక్ చలాన్ మెసేజ్ రావడంతో కథ అడ్డం తిరిగింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వచ్చిన ఆ ఈ-చలాన్‌లో బైక్ నడుపుతున్న వ్యక్తి ఫోటో స్పష్టంగా కనిపించింది. అయితే ఆ వ్యక్తి రెహ్మాన్ కాదు.. అతడి బైక్‌ను దొంగిలించిన నిందితుడు. దర్యాప్తులో పోలీసులు కూడా సంపాదించలేకపోయిన నిందితుడి ఫోటోను ట్రాఫిక్ కెమెరా ఇట్టే పట్టేసింది. ఫైసల్ ఆ చలాన్ ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ, నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను కోరాడు.

ఇది చదవండి: మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.? ఇది చూస్తే ఇంకెప్పుడూ పడెయ్యరు..

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. టెక్నాలజీ ద్వారా నిందితుడి ఫోటో దొరికినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మరిన్ని సంఘటనలను ఉదహరిస్తూ, ట్రాఫిక్, క్రైమ్ డేటాబేస్‌ల మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. అటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక వాహనం దొంగతనానికి గురైనట్లు పోలీసు రికార్డుల్లో ఉన్నప్పటికీ, అదే వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్‌గా యజమానికే చలాన్ పంపిస్తోంది.

ఆ వాహనం ‘స్టోలెన్’గా ఫ్లాగ్ చేసిందా లేదా అన్నది ట్రాఫిక్ కెమెరా వ్యవస్థలు క్రాస్-చెక్ చేయడం లేదు. కాగా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా, వివిధ విభాగాల మధ్య డిజిటల్ డేటాబేస్ అనుసంధానం కాకపోవడం వల్ల బాధితులు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. భువనేశ్వర్‌లో ఇలాంటి చలానా ఫోటో ఆధారంగానే ఒక దొంగను పట్టుకున్న సంఘటన కూడా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు కూడా ఈ ఫోటోను ఆధారంగా చేసుకుని త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని బాధితుడు ఆశిస్తున్నాడు.

ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

Follow Us