నేడే వైశాఖ పౌర్ణమి.. ఈ ఒక్క రాత్రి ఇలా చేస్తే దరిద్రం పరిగెత్తాల్సిందే!
samatha
30 April 2026
ఈరోజు మే 1 శుక్రవారం రోజున వైశాఖ పౌర్ణమి, దీనిని బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
పూర్ణిమ
శక్తివంతమైన పూర్ణిమలో ఇది కూడా ఒకటి. ఈ రోజు ఎవరు అయితే శివారాధన, సత్యనారాయణ స్వామి వారిని పూజిస్తారో వారికి విషిష్టమైన ప్రయోజనాలు కలుగుతాయని అంటారు.
శివారాధన
అంతే కాకుండా జ్యోతిష్య పరంగా కూడా ఇది చాలా పవిత్రమైనది. ఎవరు అయితే ఆర్థిక, అనారోగ్యం వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం చాలా మంచిది.
పరిహారాలు
ముఖ్యంగా ఈరోజు రాత్రి నిండు చందమామని చూస్తూ, కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం వలన దరిద్రం తొలిగిపోయి, అదృష్టం కలిసి వస్తుందంట. ఆ పూజలు ఏవో చూద్దాం.
నిండు చందమామ
బుద్ధ పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేచి , నది స్నానం చేయడం చాలా మంచిది. తర్వాత ఇంటిని శుభ్రం చేసి, పూజ చేయాలి. దీని వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది.
నది స్నానం
అలాగే ఈ రోజు దాన ధర్మాలు చేయడం వలన విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా మీ ఇంటిలో సంపద పెరుగుతుందని చెబుతున్నారు పండితులు.
దాన ధర్మాలు చేయడం
బుద్ధ పౌర్ణమి రోజు ఎవరు రాత్రి సమయంలో నిండు చందమామ దర్శనం చేసుకొని, పాలు లేదా నీటితో అర్ఘ్యం సమర్పించడం వలన దరిద్రం తొలిగిపోయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది.
పాలతో అర్ఘ్యం సమర్పించడం
అలాగే ఈ రోజు రాత్రి చంద మామ వెలుగుల మధ్య తులసి చెట్టు లేదా, రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం వలన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి