Hyderabad: న్యూయర్ ఫీవర్.. వాటికి భారీగా పెరిగిన డిమాండ్.. కుప్పలు తెప్పలుగా ఆర్డర్స్‌!

కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలు ముమ్మరంగా సాగుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు న్యూ ఇయర్ వేడుకల కోసం సిద్ధం అయ్యాయి. ఆయా హోటల్స్‌ రెస్టారెంట్స్‌కు ఇప్పటికే భారీగా చికెన్, మటన్‌తో పాటు హైదరాబాద్ బిర్యానీకి ఆర్డర్స్ వచ్చాయి. దీంతో క్వాలిటీ బిర్యానీ సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే దొరికే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటిని నగరవాసులు దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం.

Hyderabad: న్యూయర్ ఫీవర్.. వాటికి భారీగా పెరిగిన డిమాండ్.. కుప్పలు తెప్పలుగా ఆర్డర్స్‌!
Hyderabad New Year

Updated on: Dec 31, 2025 | 12:42 PM

మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం రానుంది. దీంతో న్యూయర్ వేడుకులకు అంతా సిద్ధమవుతున్నారు. ఇక అప్పుడే హైదరాబాద్‌లో న్యూయర్ సందడి మొదలైంది. కొత్త సంవత్సరం వేడుకల కోసం నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. న్యూయర్ సందర్భంగా భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉండడంతో డిమాండ్‌కు సరిపడా సప్లయ్ ఉండేలా హోటల్‌, రెస్టారెంట్స్‌ యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వచ్చిన కస్టమర్లను వెనక్కి పంపించకుండా చూసుకునేందుకు అనదంగా వంటకాలను ప్రిపేర్‌ చేస్తున్నారు హోటల్‌ యాజమాన్యాలు.

రెస్టారెంట్‌లలో వీటికే భారీ ఆర్డర్స్‌

అయితే న్యూయర్ సందర్భంగా ఉదయం నుంచే చికెన్‌, మటన్‌కు గిరాకీ భారీగా పెరిగింది. అదే విధంగా హోటళ్లు, రెస్టారెంట్లకు సైతం ఊహించని రీతిలో బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ, నుంచి జాఫ్రానీ బిర్యానీ, మండి, కబ్సా, ధమ్కా బక్రా, పత్తర్‌కా ఘోష్‌ , ఖుబానీ కా మీఠా, డబల్‌ క మీఠా, పాయా, మలై పాయాకు వేలల్లో ఆర్డర్లు వచ్చినట్టు హోలట్‌ నిర్వాహకులు చెబుతున్నారు. వీటితో పాటు ఈ సారి బీఫ్‌కు కూడా భారీగా ఆర్డర్స్‌ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే భారీ ఆర్డర్ల నేపథ్యంలో సాయంత్రం 8 గంటల వరకే క్వాలిటీ బిర్యానీ దొరికే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కస్టమర్లను ఆకర్శించేందుకు ప్రత్యేక ఆఫర్లు

ఇక న్యూ ఇయర్ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు హోటల్‌, రెస్టారెంట్స్‌, పబ్స్‌ ప్రత్యేక ఆఫర్లును ప్రకటిస్తున్నాయి.స్టే, డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి థీమ్డ్ ప్యాకేజీలు, ప్రత్యేక డిన్నర్లు, స్పా ఆఫర్లు, లేట్ చెక్-అవుట్, వెల్కమ్ డ్రింక్స్, ఫ్యామిలీ ప్యాకేజీలు ఇలా రకరకాల ఆఫర్లను రెడీ చేశాయి. అలాగే కొన్ని రెస్టారెంట్స్‌, అండ్‌ పబ్స్‌లో స్పెషల్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.