Telangana Rains: మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ముంచెత్తుతున్న వానలతో జనజీవనం అస్తవ్యస్థం..

|

Aug 03, 2022 | 9:36 AM

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు బుధ, గురు వారాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ (Telangana) మీదుగా కోమరిన్‌ వరకూ ఉపరితల ద్రోణి...

Telangana Rains: మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ముంచెత్తుతున్న వానలతో జనజీవనం అస్తవ్యస్థం..
Telangana Rain Alert
Follow us on

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు బుధ, గురు వారాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ (Telangana) మీదుగా కోమరిన్‌ వరకూ ఉపరితల ద్రోణి విస్తరించినందని, ఫలితంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో బంగాళాఖాతంపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లా మంగళపల్లెలో 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తూఫ్రాన్‌పేటలో 8.3, ఇల్లెందులో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, మియాపూర్‌, ముషీరాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, చిక్కడపల్లి, రాంనగర్, మూసాపేట, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్‌, బేగంపేట, మెహదీపట్నం, ఎర్రగడ్డ, లక్డీకాపూల్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్‌, కవాడిగూడ, గాంధీనగర్, దోమలగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్, మలక్​పేట్, భోలక్ పూర్, జవహర్‌నగర్, దిల్ సుఖ్ నగర్, చాదర్​ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, హయత్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

మరోవైపు..దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళను కుండపోత వానలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అసోం, ఢిల్లీ, తమిళనాడులో కురుస్తున్న వర్షాలకు రాకపోకలు స్తంభించాయి. కేరళలోని కొల్లాం, కాయంకుళం, కొచ్చి లో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. వర్షాల నేపథ్యతంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కేరళలో ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. కాగా.. గతవారం 7 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

కేరళలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారుల ప్రకటనలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కొండ ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే పునారావాస కేంద్రాలకు వెళ్లాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆదేశించారు. అసోంలోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెగని వానలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వానలతో అష్టకష్టాలు పడుతున్నామని, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పొంగిపొర్లుతున్న వాన నీటితో బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి