హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నగరంలో కురిసిన తొలకరి వర్షం తో నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రెండు గంటల ఏకదాటిగా కురిసన జోరు వనకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, అంబర్‌పేట్, నల్లకుంట, నాచారం, ఓయూ ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది
దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, కింగ్ కోఠి, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో జోరు వర్షం పడగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడింది.
కూకట్‌పల్లిలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
సికింద్రాబాద్ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలో వరద నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముషీరాబాద్ లోని ప్రేయర్ పవర్ చర్చి ముందు వీధిలో నీటిలో ఓ కారు కొట్టుకొచ్చింది.
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించే పనుల్లో ఉన్నారు. ఉదయం నుంచి మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.