తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెతిస్తున్నాయి.. నిప్పుల కుంపటిలా వాతావరణం మారుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ఇప్పటినుంచే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజులకుగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరిక చేసింది వాతావరణశాఖ.. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది..
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 37 మండలాల్లో వడగాల్పులు, వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం 18 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు.
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
సోమవారం 36 మండలాల్లో వడగాల్పులు,మంగళవారం37 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ఆదివారం 18 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) March 31, 2024
కాగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు..
7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated : 31-03-2024 pic.twitter.com/bN6P1pNCM7
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 31, 2024
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ఎక్కువగా బయటకు రాకుండా ఉండాలి.. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వెళల్లో వెళ్లాలి.. మధ్యాహ్నం వేళ వెళ్లాల్సివస్తే గొడుగులు లాంటివి ఉపయోగించాలి.
నీటి బాటిళ్లను వెంట ఉంచుకుని తరచూ తాగుతుండాలి.. ఎండాకాలంలో ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
జ్వరం, ఆందోళన, ఊపిరాడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కాటన్ దుస్తులు ధరించడం మేలు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..