జై బోలో హనుమాన్ జీ కీ!

హనుమాన్ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమైంది. కాసపటి క్రితం గౌలిగూడ రామాలయం వద్ద ప్రారంభమైన యాత్ర సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వరకు కొనసాగుతుంది. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ బాటా, బైబిల్ హౌస్ మీదుగా తాడ్‌బండ్ వరకు సుమారు 13 కిలోమీటర్లు శోభాయాత్ర సాగనుంది. శోభాయత్ర కోసం 8,000 మంది సిబ్బంది.. 400 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘా పెడుతున్నారు. ఇక వైన్ షాపులు, బార్లు, […]

జై బోలో హనుమాన్ జీ కీ!

Edited By:

Updated on: Apr 19, 2019 | 12:56 PM

హనుమాన్ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమైంది. కాసపటి క్రితం గౌలిగూడ రామాలయం వద్ద ప్రారంభమైన యాత్ర సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వరకు కొనసాగుతుంది. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ బాటా, బైబిల్ హౌస్ మీదుగా తాడ్‌బండ్ వరకు సుమారు 13 కిలోమీటర్లు శోభాయాత్ర సాగనుంది. శోభాయత్ర కోసం 8,000 మంది సిబ్బంది.. 400 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘా పెడుతున్నారు. ఇక వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లను ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మూసి వేశారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ తెలిపారు.

హనుమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హనుమాన్ శోభాయాత్ర చేపట్టే ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. దీనికి సంబంధించి శోభాయాత్ర రూట్‌మ్యాప్‌ను హైదరాబాద్ పోలీసులు తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.