Hyderabad: హైదరాబాద్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో అందుబాటులోకి రానున్న నాలుగు ప్రాజెక్టులు

|

Feb 22, 2022 | 2:36 PM

Hyderabad:తెలంగాణ సర్కార్ హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. సుందరీకరణ పనులతో పాటు ప్లై ఓవర్స్‌పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌..

Hyderabad: హైదరాబాద్‌ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో అందుబాటులోకి రానున్న నాలుగు ప్రాజెక్టులు
Follow us on

Hyderabad: తెలంగాణ సర్కార్ హైదరాబాద్‌ అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. సుందరీకరణ పనులతో పాటు ప్లై ఓవర్స్‌పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరానికి మరో నాలుగు కొత్త ప్రాజెక్టు (Projects)లు అందుబాటులోకి రానున్నాయి. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను ఏర్పాటుకు స్కై వేలు, మేజర్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు ఆర్ఓబీలు, అండర్ పాస్ లు నిర్మాణాలు చేపట్టి  ట్రాఫిక్ వ్యవస్థ మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రదేశాలలో నిర్మాణాలు చేపట్టి ట్రాఫిక్ రహిత నగరంగా రూపొందించేందుకు ఎస్ఆర్‌డీపీ (SRDP) పనులు దోహద పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. మార్చి మాసం లో SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. 2 అండర్ పాసులు మరో రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకి రానున్నాయి. అందులో తుకారాం రైల్వే అండర్ పాస్, ఎల్ బి నగర్ ఆర్ హెచ్ ఎస్ అండర్ పాస్‌లు బహదూర్ పుర, భైరమాల్ గూడ అర్‌హెచ్ఎస్‌ రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తే బహద్దూర్ పుర నుండి ఉప్పల్ వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా సురక్షిత ప్రయాణంతో నిర్దేశిత గడువులోగా గమ్యానికి చేరే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా కాలుష్యం తగ్గడంతో పాటుగా వాహన ఇంధన పొదుపునకు ఎంతగానో దోహదపడతుంది. ఫ్లై ఓవర్ 780 మీటర్  పొడవులో 400 మీటర్లు డక్ పోర్షన్  ఆర్ ఈ వాల్ 12.50 మీటర్ల వెడల్పుతో నిర్మాణాలను చేపట్టారు. ఫ్లైఓవర్ పనులు ఫినిషింగ్ స్థాయిలో ఉన్నాయి. మార్చి మాసం మొదటి వారం వరకు పూర్తి చేసి రెండవ వారంలో అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి:

Assembly Meet: ఈనెల 25 లేదా 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ముందు రోజే భేటీ కానున్న కేబినెట్!

Tourist Places : భారతదేశంలో రాత్రిపూట మరింత అందంగా కనిపించే ప్రదేశాలు ఇవే