సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం TSRTC యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్-విజయవాడ రూట్ లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టినట్లు యాజమాన్యం తెలిపింది. ఆయా బస్సుల్లో దాదాపు ౩ వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరింది. టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం tsrtconline.in వెబ్ సైట్ లో సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ట్వీట్ చేశారు..
అలాగే, హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించడం జరిగిందని.. తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం #TSRTC యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్-విజయవాడ రూట్ లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు… pic.twitter.com/Nfrj6qFIv6
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) May 12, 2024
ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటుహక్కును వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో కోరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..