Godavari River Management Board: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం హైదరాబాద్ జలసౌధలో ఉపసంఘం భేటీ కొనసాగుతోంది. బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో జరుగుతున్న ఈ బేటీకి బోర్డు సభ్యులు, ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం ఈ నెల 17, 20 తేదీల్లో కూడా బేటీ అయిన సంగతి తెలిసింది.
ఇదిలావుంటే గోదావరిపై తెలంగాణా నిర్మిస్తున్న అనధికార ప్రాజెక్టులకు అనుమతుల్ని ఇవ్వొద్దని గోదావరీ నదీ యాజమాన్య బోర్డు కు ఏపీ సర్కార్ లేఖ రాసింది. సీతారామ ఎత్తిపోతల పథకం, తుపాకుల గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు తో పాటు ముక్తేశ్వరం , చౌటపల్లి, మోడికుంటవాగు ప్రాజెక్టులకు అనుమతులను ఇవ్వొద్దని కోరింది.
గోదావరి నది పై నిర్మిస్తున్న ఐదు అనధికార ప్రాజెక్టుల డీపీఆర్ లను తెలంగాణా సమర్పించిందని వాటికి అనుమతులను ఇవ్వొద్దంటూ కోరింది ఏపీ జలవనరుల శాఖ. ఎలాంటి కేటాయింపులూ లేకుండా తెలంగాణా కేటాయింపులకు అదనంగా మరో 450 టీఎంసీల గోదావరి జలాలను వాడుకుంటోందని ఏపీలో లేఖలో తెలిపింది.
ఇవి కూడా చదవండి: Leopard Attack: చేతికర్రతో చిరుతను తరిమేసిన వృద్ధురాలు.. వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..
Bhadrachalam Temple: అసలేం జరుగుతోంది రామా.. నీ ప్రసాదం కూడా మాయం చేస్తున్నారే..