Telangana: గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్.. తస్మాత్ జాగ్రత్త..

2023లో తనకు తెలిసిన యువకుడితో కలిసి గోవా వెళ్లింది ఆ మహిళ. అక్కడ ఓ రిసార్ట్ బుక్ చేసుకున్నారు వీరు. అయితే అక్కడి రూమ్‌లో జంట ప్రేవేట్‌గా గడుపుతున్న సమయంలో వీడియోలు రికార్డు చేశాడు రిసార్ట్ మేనేజ్ చేశాడు కిలాడీ ఫెల్లో.. ఆపై వేధింపులకు తెగబడ్డాడు.

Telangana: గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్.. తస్మాత్ జాగ్రత్త..
Goa Resort

Updated on: Dec 07, 2025 | 12:46 PM

గోవాకు వెళ్లే జంటలు జాగ్రత్త. ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా.. మీ ప్రైవసీని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు బద్మాష్‌గాళ్లు. ప్రేమ జంట వీడియోలను రహస్యంగా తీసి బ్లాక్‌మెయిల్‌కి దిగాడు గోవాకు చెందిన హోటల్ యజమాని. మరొకరితో పెళ్లైంది, వదిలేయమని వేడుకున్నా వినకుండా వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఓ బాధితురాలు. తన గోడు చెప్పుకునేందుకు పోలీసులను ఆశ్రయించింది. ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ పెళ్లికి ముందు 2023లో ఓ వ్యక్తితో కలిసి గోవా వెళ్లింది. వారు అక్కడ వైల్డ్ బెర్రీ రిసార్ట్‌లో రూమ్ బుక్ చేసుకున్నారు. వారికి బసతో పాటు ఉండేందుకు ఏర్పాట్లు చేశాడు ఆ రిసార్ట్‌కు చెందిన యశ్వంత్ పాగి.

ఇటీవల మహిళకు ఫోన్ చేశాడు, గతంలో మీరు సన్నిహితంగా ఉండే వీడియోలు తీశాను, 30 లక్షల రూపాయలు ఇవ్వకపోతే అంతా బయటపెడుతానని వేధింపులకు దిగాడు యశ్వంత్.
తనకు ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లయిందని, తన వైవాహిక జీవితం చెడిపోతుందని, వదిలేయమని వేడుకుంది. వైవాహిక జీవితానికి ఇబ్బంది అవుతుందని.. అప్పటి భాగస్వామితో కొంత మొత్తం కూడా ఇప్పించింది. అయినా యశ్వంత్ ఇంకా డబ్బు ఇవ్వాలని మానసిక వేధింపులకు దిగడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ.  మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న సనత్‌నగర్ పోలీసులు. హోటల్ యజమాని యశ్వంత్‌ను పట్టుకునేందుకు సనత్ నగర్ పోలీసులు గోవాకు వెళ్లారు.

సో.. గోవా అని కాదు.. ఎలాంటి హోటల్స్ లేదా ప్లేసెస్‌కు వెళ్లినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మోసగాళ్లు అన్ని చోట్లా ఉంటారు. అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనపై కూడా ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి