ఉన్మాది ప్రేమకు ఆరిపోయిన ‘జ్యోతి’

హైదరాబాద్: ప్రేమ వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఇక ఈ ఘటన కేపీహెచ్​బీ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మెదక్​ జిల్లా కోహెడ మండలం మైసంపల్లికి చెందిన జ్యోతి డిగ్రీ వరకు చదువుకుంది. కుటుంబానికి ఆసరాగా ఉండాలని హైదరాబాద్ లోని కేపీహెచ్​బీ నాలుగో ఫేజ్ లో నివాసముంటూ ఓ ప్రైవేట్ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తోంది. ఖాతా గ్రామానికి చెందిన రాకేష్ […]

ఉన్మాది ప్రేమకు ఆరిపోయిన జ్యోతి

Updated on: Apr 16, 2019 | 7:15 PM

హైదరాబాద్: ప్రేమ వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ఇక ఈ ఘటన కేపీహెచ్​బీ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మెదక్​ జిల్లా కోహెడ మండలం మైసంపల్లికి చెందిన జ్యోతి డిగ్రీ వరకు చదువుకుంది. కుటుంబానికి ఆసరాగా ఉండాలని హైదరాబాద్ లోని కేపీహెచ్​బీ నాలుగో ఫేజ్ లో నివాసముంటూ ఓ ప్రైవేట్ సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తోంది. ఖాతా గ్రామానికి చెందిన రాకేష్ రెడ్డి అనే యువకుడు ఆమెను గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇక ఆ అమ్మాయి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. రాకేష్ రెడ్డిని ఆమె తల్లిదండ్రులు పలుమార్లు మందలించినా కూడా అతని తీరు మారలేదు.. వేధింపులు ఇంకా పెరిగాయి. దీంతో ఆ అమ్మాయి మానసికంగా కృంగిపోయి.. ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న రాత్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.