గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అధికారులు కీలక సూచన చేశారు. గతంలో హైదరాబాద్ లో డబుల్ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని ఇంటి అడ్రస్ మారిన వారి కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అప్లికేషన్స్ ఇచ్చే ముందు ఉన్న అడ్రస్‌ను నుంచి కొత్త చిరునామాకు మారిన వారు వెంటనే సర్కిల్ కార్యాలయ్యాన్ని సంప్రదించాలని కోరారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంత మంది అడ్రస్ మారారు.
దీంతో అడ్రస్ మారిన వారి వివరాలను జీహెచ్‌ఎంసీ సేకరించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు తాజా ప్రకటన చేశారు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేయని వారు ఎవరైనా ఉంటే తమ సమీపంలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయానికి ఓటరు గుర్తింపు కార్డుతో వెళ్లి సవరించుకోవాలని అధికారులు తెలిపారు.
గతంలో మీ-సేవ, కలెక్టర్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని సేకరించే బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేథ్యంలోనే ఇంటి అడ్రస్ మారి, ఇప్పటి వరకు సవరణ చేసుకోని దరఖాస్తుదారులు వెంటనే తమ సమీపంలోని జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీస్‌లో సంప్రదించి తమ దరఖాస్తులను సవరణ చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కోరింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..