Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనూ GHMC సేవలు!

హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇకపై ప్రజలు ఆఫీస్‌ వరకు రాకుండానే ఇంట్లోనే తమ ఫోన్‌లోని వాట్సాప్‌ ద్వారా తమ సమస్యలపై ఫిర్యాదులు చేయడం, పన్నులు చెల్లించేలా సరికొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత వాట్సప్ చాట్‌బాట్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్న ఆ చాట్‌బాట్‌ క్లియర్‌ చేసేలా దాన్ని రూపొందించనున్నారు.

Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనూ GHMC సేవలు!
Ghmc Whatsapp Service

Updated on: Sep 11, 2025 | 3:09 PM

పెరుగున్న టెక్నాలజీని వినియోగించుకోవలంలో మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ నగరంలోని జీహెచ్‌ఎంసీ అధికారులు పౌరుల సౌకర్యం కోసం వాట్సాప్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఇకపై ప్రజలు ఆఫీస్‌ వరకు వెళ్లకుండానే ఇంట్లో నుంచే తమ ఫోన్‌లోని వాట్సాప్‌ ద్వారా తమ సమస్యలపై ఫిర్యాదులు చేయడం, పన్నులు చెల్లించడం చేయవచ్చు. ఇందుకోసం అధికారులు ఏఐ ఆధారిత సరికొత్త వాట్సాప్‌ చాట్‌బాట్‌ను కూడా రూపొందిస్తున్నారు.మీ సమస్యలపై మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు ఈ చాట్‌బాట్‌ ద్వారా వాటని క్లియర్ చేసుకోవచ్చు.

 వాట్సాప్‌లో చాట్‌బాట్‌ సేవలు

ఈ చాట్‌బాట్ సహాయంతో ప్రజలు ఈజీగా తమ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు. మీరు చేసిన ఫిర్యాదును ఆ చాట్‌బాట్‌ నేరుగా సంబంధిత అధికారురికి చేరవేస్తుంది. ఒక వేళ ఏ సమస్యకి ఏ అధికారికి ఫిర్యాదు చేయాలో మీకు తెలియక పోతే.. ఆ చాట్‌ బాట్‌ మీకు అర్థమయ్యేలా చెప్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో అప్‌డేట్‌ చేసిన తర్వాత అధికారులు ఈ వాట్సాప్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అప్పుడు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, వంటి చెల్లింపులను కూడా వాట్సాప్‌ ద్వారానే చేయవచ్చు.

24 గంటలు సేవలు అందించడమే లక్ష్యం

వాటితో పాటు భర్త్‌, అండ్‌ డెత్‌ సర్టిఫికెట్లను కూడా ఈ చాట్‌బాట్‌ సహాయంతో పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే పౌరులకు 24 గంటల పాటు సేవలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ చాట్‌బాట్‌న అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వచ్చే వారంలో చాట్‌బాట్‌ సేవల కోసం టెండర్లను పిలవనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.