Concarpus Trees: కోనో కార్పస్‌ మొక్కలు నాటొద్దు.. నరకొద్దు..! జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు..

కోనో కార్పస్‌ చెట్ల వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది కేంద్రం. గైడ్‌లెన్స్ జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది? అధికారులు ఏం చెప్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి మరి

Concarpus Trees: కోనో కార్పస్‌ మొక్కలు నాటొద్దు.. నరకొద్దు..! జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు..
Conocorpus Trees In Telangana Dangerous

Updated on: Apr 16, 2025 | 10:20 PM

కోనో కార్పస్‌ మొక్కలపై ప్రజల్లో రోజురోజుకు పెరిగిపోతున్న ఆపోహలతో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా నాటోద్దు.. ఉన్నవి నరకొద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ UBD అడిషనల్ కమిషనర్ సుభద్ర చెప్పారు. కోనో కార్పస్‌ చెట్లపై అపోహలొద్దని.. కోనో కార్పస్‌ చెట్లను నరికితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఏ చెట్టును తొలగించాలన్నా NOC తీసుకోవాలి.. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు తొలగిస్తే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు జీహెచ్‌ఎంసీ UBD అడిషనల్ కమిషనర్ సుభద్ర. ఎక్కడైనా ఏదైన ఇబ్బందులు తలెత్తితే జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇస్తే చర్యలు చేపడతామన్నారు.

ఇదీలా ఉంటే కోనో కార్పస్‌ చెట్లు కొంతమంది వెరీ గుడ్‌ అంటే.. మరికొంతమంది ప్రాణానికే ప్రమాదమని చెప్తున్నారు. ఫైనల్‌గా ఆస్తమా వస్తుందనే ప్రచారంలో కొంత నిజం ఉన్నా.. ఇది అన్ని మొక్కలకూ వర్తిస్తుందంటున్నారు సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ మోహన్‌రావు. కోనోకార్పస్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కోనోకార్పస్‌ ఆకులను మేకలకు పెడితే పాల ఉత్పత్తి 20శాతం పెరిగినట్టు అధ్యయనాల్లో తేలిందన్నారు. ఏడారిలో అయినా, నీళ్లు లేకపోయినా ఇవి బతుకగలవన్నారు. కోనో కార్పస్ మొక్కలతో పర్యావరణ పరిరక్షణ అవుతందంటోంది జన చైతన్య వేదిక.