Kishan Reddy: కేంద్రం తరపున రామోజీరావుకు నివాళులర్పించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

|

Jun 08, 2024 | 4:17 PM

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు రామోజీరావు. ఉషాకిరణ్‌..

Kishan Reddy: కేంద్రం తరపున రామోజీరావుకు నివాళులర్పించనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Kisan Reddy
Follow us on

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు రామోజీరావు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారాయన. ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌ ద్వారా ఎంతోమంది నటులు పరిచయమై ఎంతోమంది నటులు, అగ్రశ్రేణి తారలుగా ఎదిగారు. భారతీయ చలనచిత్ర రంగాన్ని నూతన శిఖరాలకు చేర్చారు రామోజీరావు. ఈటీవీ మీటీవీ అంటూ బుల్లితెరపై అద్భుతాలు సృష్టించారు రామోజీరావు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీ ప్రారంభించారు. సీరియల్స్ ద్వారా వేలమంది నటీనటులను బుల్లితెరకు పరిచయం చేశారు రామోజీరావు. తక్కువ సమయంలోనే జాతీయస్థాయి నెట్‌వర్క్‌గా ఈటీవీ విస్తరించింది. ప్రతిక్షణం ప్రపంచ వీక్షణం పేరిట 13 భాషల్లో వార్తలు అందించారు రామోజీరావు.

ఈ నేపథ్యంలో శనివారం కేంద్రం ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రామోజీరావుకు నివాళులు అర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకోనున్న కిషన్‌రెడ్డి నివాళులు అర్పిస్తారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ రామోజీ రావు మృతిప‌ట్ల సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. జర్నలిజం రంగంలో, చలనచిత్ర ప్రపంచంలో ఆయన చేసిన సేవలను గుర్తించారు.