Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. బస్ టెర్మినల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

|

Jul 09, 2022 | 7:03 AM

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. విపరీతంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు గతంలో కీలక ప్రతిపాదన చేశారు....

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. బస్ టెర్మినల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Bus
Follow us on

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. విపరీతంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు గతంలో కీలక ప్రతిపాదన చేశారు. వనస్థలిపురంలో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ (Bus Terminal) నిర్మించాలని నిర్ణయించారు. అయితే కొన్ని కారణాలతో అది ముందుకు సాగలేదు. దీంతో ఈ అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అటవీ శాఖ అభ్యంతరాలతో ఆగిన భూసేకరణ అతి త్వరలో కొలిక్కి రానుంది. నిర్మాణానికి రెండు రెట్లు భూమిని కేటాయించేందుకు అటవీ శాఖ (Vanasthalipuram) అంగీకరించింది. ఫలితంగా బస్సు టెర్మినల్‌ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది.హరిణ వనస్థలి జింకల పార్కుకు సమీపంలోనే ఈ అధునాతన బస్సు టెర్మినల్‌ నిర్మాణానికి గతంలో హెఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. వివిధ రకాల సంప్రదింపులు జరిగిన అనంతరం అటవీశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

కొత్తగా నిర్మించబోయే ఈ బస్సు టెర్మినల్ కు ఎన్నో విశేషాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, వైజాగ్‌, గుంటూరు, ఖమ్మం, భద్రాచలం, నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ ప్రాంతాలకు రోజూ 20-25 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం వరకు చేరుకొని అక్కడి నుంచి ప్రధాన బస్సుల్లో వెళ్తారు. కాబట్టి ఈ బస్సు టెర్మినల్ నిర్మాణం పూర్తయితే వారి ఇబ్బందులు తగ్గుతాయి. టెర్మినల్‌ నుంచి రోజూ 500-600 ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగించే వీలు ఏర్పడుతుంది.