Hyderabad: బాచుపల్లిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుడు – ఆపి తనిఖీ చేయగా

బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగనోట్ల కలకలం చోటు చేసుకుంది. ప్రత్తిపాటి ప్రేమచందు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి 15 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ.. రెడ్‌మీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పూణేకు చెందిన రాకేష్ అతనికి ఈ దొంగనోట్లు సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి.. ప్రేమచందును రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: బాచుపల్లిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుడు - ఆపి తనిఖీ చేయగా
Police With Accused

Updated on: Jun 22, 2025 | 10:00 PM

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగనోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్తిపాటి ప్రేమచందును నిజాంపేటలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 15 లక్షల రూపాయల దొంగనోట్లు, రెడ్‌మీ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ నోట్లన్నీ రూ 500 విలువ కలిగిన పేక్ కరెన్సీగా గుర్తించారు. ప్రేమచందు.. ఈ నకిలీ కరెన్సీని చలామణి చేయడానికి ప్రయత్నిస్తుండగా అరెస్టయ్యాడు.

పోలీసుల విచారణలో,పూణేకు చెందిన రాకేష్ అనే వ్యక్తి ప్రేమచందుకు ఈ దొంగనోట్లను సరఫరా చేసినట్లు వెల్లడైంది. బాచుపల్లి పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు. ఈ దొంగనోట్ల వ్యవహారం ఇంకా పెద్ద నెట్‌వర్క్‌కు సంబంధించినదిగా భావించి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా లావాదేవీలను వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..