ED Raids: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు.. సంచలనం రేపుతున్న ఈఎస్‌ఐ కుంభకోణం

|

Apr 10, 2021 | 12:32 PM

ED Raids: ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో భారీగా సోదాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు జరుపుతోంది....

ED Raids: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు.. సంచలనం రేపుతున్న ఈఎస్‌ఐ కుంభకోణం
Enforcement Directorate
Follow us on

ED Raids: ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో భారీగా సోదాలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి 10 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు జరుపుతోంది. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, అలాగే నాయిని మాజీ పీఎస్‌ ముకుందారెడ్డి, దేవికారాణి, ఇతర నిందితుల ఇళ్లల్లో ఈడీ సోదాలు కొనసాగిస్తోంది.

కాగా, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్‌ మందుల కుంభకోణంలోఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల విషయంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు స్వాహా చేసిన వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కుంభ కోణంలో కీలక నిందితురాలు దేవికారాణి అక్రమార్జనలో భాగమైన రూ.4.47 కోట్ల సొమ్మును గత ఏడాది కూకట్‌పల్లికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థకు ఈ సొమ్ము చెల్లించారు. గతంలోనే ఈ లావాదేవీల గురించి ఆ స్థిరాస్తి సంస్థ నిర్వాహకులు ఏసీబీఅ ధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

ఇవీ చదవండి: అమెరికాలో సంచలనం రేపుతున్న భారతీయ దంపతుల అనుమానస్పద మృతి.. ఇది హత్యేనా..? దర్యాప్తు ముమ్మరం

సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టి బోల్తా పడ్డ టిప్పర్‌.. 18 మందికి గాయాలు