Watch Video: వీహెచ్ కారు అద్దాలు ధ్వంసం చేసింది ఇతనే.. సీసీటీవీలో రికార్డ్ ..

|

Apr 14, 2022 | 11:27 AM

V. Hanumantha Rao: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ కారును దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు అద్దాలు..

Watch Video: వీహెచ్ కారు అద్దాలు ధ్వంసం చేసింది ఇతనే.. సీసీటీవీలో రికార్డ్ ..
Vh Home Cctv
Follow us on

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు(V. Hanumantha Rao) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన ఘటన సంచలనంగా మారుతోంది. అర్థరాత్రి ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డాడు ఓ ఆకతాయి. హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఇంటి ముందు ఉన్న కారును దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు అద్దాలు పగుల కొట్టడం మనం అందులో చూడవచ్చు. కేవలం కారు అద్దలపై మాత్రమే దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వీహెచ్ ఇంటివద్ద నిలిపిన కారుపై దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో వీహెచ్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఉదయం కారు ధ్వంసమైన విషయాన్ని గుర్తించిన వీహ్..పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాడి జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దాడికి పాల్పడిన ఆ ఆకతాయిని గుర్తించారు. యూపీకి చెందిన సిద్ధార్థ్‌ దాడి చేసినట్టుగా తేల్చారు. 6 నెలలుగా వీహెచ్ ఇంటిపక్కనే ఉంటున్న సిద్ధార్థ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానన్నారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదే అని చెప్పారు. మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తనకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేదా అని నిలదీశారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి విన్నవించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాకేమైనా అయితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. మరోవైపు అంబేద్కర్‌ విగ్రహం దగ్గర మౌనదీక్షకు దిగారు వీహెచ్. అంబేద్కర్‌ విగ్రహంపై చాలా రోజుల నుంచి పోరాడుతున్నానన్నారు. మా పార్టీ వాళ్లకు కూడా చెప్పినా స్పందించలేదన్నారు.

ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..

JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!