CM Revanth Reddy: నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..

|

Aug 07, 2024 | 7:18 AM

తెలంగాణకు పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. నాల్గవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్‌ టీమ్‌.. ఆర్సీసీయం, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, స్వచ్ఛ్‌ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది.

CM Revanth Reddy: నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..
Cm Revanth Reddy
Follow us on

తెలంగాణకు పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. నాల్గవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్‌ టీమ్‌.. ఆర్సీసీయం, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, స్వచ్ఛ్‌ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. న్యూయార్క్‌ పర్యటన తర్వాత వాషింగ్టన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌ బృందం.. ఇవాళ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం కానుంది.

అమెరికాలో సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌ పర్యటన కొసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో బిజీబిజీగా గడుపుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తూ.. పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటోంది. నిన్న ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌తో ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్‌ బృందం.. తాజాగా మరికొన్ని కంపెనీలతోనూ డీల్‌ కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే.. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌, అడ్వాన్స్‌డ్‌ డేటా ఆపరేషన్స్‌లో ఆర్సీసీయం హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆర్సీసీయం సీఈవో గౌరవ్‌సూరి, ఇతర ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్‌ బృందం జరిపిన చర్చల్లో కంపెనీ ఏర్పాటు ఒప్పందం కుదిరింది.

ఇక.. అమెరికా వెలువల తొలిసారి హైదరాబాద్‌లో కంపెనీ చేయబోతున్నట్లు ఆర్సీసీయం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ సాయంతో తమ సేవలను మరింత విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. గొప్ప టాలెంట్‌ ఫోర్స్‌, సహజసిద్ధ లొకేషన్‌, స్కిల్స్‌ కలిగిన ఎంప్లాయిస్‌ అందుబాటులో ఉండడంతో హైదరాబాద్‌లో డేటా సొల్యూషన్‌ సర్వీసులను అభివృద్ధి చేస్తున్నామన్నారు ఆర్సీసీయం సీఈవో గౌరవ్‌ సూరి. దాంతో.. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500మంది అత్యాధునికి సాంకేతిక నైపుణ్యం కలిగినవారికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

మరోవైపు.. సీఎం రేవంత్‌రెడ్డితో స్వచ్ఛ్‌ బయో కంపెనీ ఛైర్మన్‌ ప్రవీణ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులకు స్వచ్ఛ్‌ బయో కంపెనీ అంగీకరించింది. దీని ద్వారా తెలంగాణలో జీవ ఇంధన ప్లాంటు నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. సీఎం రేవంత్‌ను హెచ్‌సీఏ హెల్త్‌కేర్ ప్రతినిధులు కలిశారు. హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌సీఏ హెల్త్‌కేర్ ప్రకటించింది. అలాగే.. సీఎం రేవంత్‌ టీమ్‌తో ట్రైజిన్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణలో ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఫలితంగా.. మూడేళ్లలో వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ట్రైజిన్‌ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. అటు.. న్యూయార్క్‌లో పలు కంపెనీల ఒప్పందాల తర్వాత వాషింగ్టన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం.. ఇవాళ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశం అవుతారు. అటు..పెప్సీకో యాజమాన్యంతో చర్చలు జరపనున్నారు.

అంతకుముందు.. నాల్గవ రోజు పర్యటనలో అమెరికాలోని పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశయ్యారు. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానం అని.. దానికి తగ్గట్లే.. కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌లో ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని.. ఏఐ హబ్‌, మెడికల్‌, టూరిజం, స్పోర్ట్స్‌తో పాటు.. ఫార్మా విలేజ్‌లు అభివృద్ధి చేస్తామన్నారు. చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని వెల్లడించారు సీఎం రేవంత్‌. మొత్తంగా… తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌ బృందం అమెరికాలో వేట కొనసాగిస్తోంది. పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ ముందుకెళ్తోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..