Hyderabad: ట్విట్టర్ ఫిర్యాదుతో ఆకతాయిల ఆగడాలకు చెక్.. నెంబర్ ప్లేట్ ఆధారంగానే..
Hyderabad: ఆకతాయిల చేష్టలకు విసిగిపోయిన స్థానికులు వారి ఆగడాలను వీడియో చిత్రీకరించి హైదరాబాద్ రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెహికల్ నెంబర్ ఆధారంగా ఆకతాయిని గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. సరూర్ నగర్‌లోని DNT కాలనీలో నివాసముంటున్న సాయి కృష్ణ అనే యువకుడు గడిచిన నెల రోజులుగా దిల్‌షుక్ నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్దకు వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులకు..

హైదరాబాద్, ఆగస్టు 6: ట్విట్టర్ కంప్లైంట్ ద్వారా ఆకతాయి ఆగడాలకు చెక్ పెట్టారు హైదరాబాద్ సిటీ పోలీసుల. గడిచిన నెల రోజులుగా దిల్‌షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద ఆకతాయిల చేష్టలకు విసిగిపోయిన స్థానికులు వారి ఆగడాలను వీడియో చిత్రీకరించి హైదరాబాద్ రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెహికల్ నెంబర్ ఆధారంగా ఆకతాయిని గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. సరూర్ నగర్‌లోని DNT కాలనీలో నివాసముంటున్న సాయి కృష్ణ అనే యువకుడు గడిచిన నెల రోజులుగా దిల్‌షుక్ నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్దకు వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తన రాష్ డ్రైవింగ్, వికృత చేష్టలతో హడావిడి చేస్తున్నారు. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు.. గడిచిన నెల రోజులుగా అతడిది ఇదే తంతు. దీంతో స్థానిక వ్యాపారులు సాయికృష్ణ ఆగడాలను వీడియో చిత్రీకరించి ట్విట్టర్ ద్వారా పోలీసులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.
రాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా గుడికి వచ్చే మహిళా భక్తులను టీజింగ్ చేస్తుండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. స్థానిక వ్యాపారులు భక్తులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సాయి కృష్ణపై మోటార్ వెహికల్ యాక్ట్‌తో పాటు ఈవ్ టీజింగ్ కింద కేసు నమోదు చేశారు. సాయి కృష్ణతో పాటు అతడికి సహకరిస్తున్నటువంటి మరో స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాలేజ్ ముగిసిన తర్వాత రోజు దిల్‌షుక్ నగర్ సాయిబాబా ఆలయానికి వచ్చి అక్కడికి వచ్చే భక్తులతో రాష్ డ్రైవింగ్‌తో పాటు అసభ్యకరంగా వారితో వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలాంటివారి వల్ల గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది తప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు.



Raash driving creating public newsence please react 🙏 place Dilsukhnagar city bus stop back side gully @hydcitypolice @HYDTP #dilsukhnagar @CPHydCity @RachakondaCop #Hyderabad pic.twitter.com/sFe6DaHy1x
— Praveen NTR (@Praveen09848270) August 4, 2023
గురువారం మినహా మిగిలిన రోజుల్లో పోలీసుల మఫ్టీలో తిరగడాన్ని తగ్గించడంతో దాన్ని ఆసరాగా తీసుకుంటున్న పోకిరీలు ఆరు రోజుల పాటు అక్కడే తిష్ట వేసి వచ్చే భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోతున్నారు. గతంలో పోకిరి చేష్టలు ఎక్కువ కావడంతో ఆలయ నిర్వహకులు దిల్‌షుక్ నగర్ సాయిబాబా ఆలయం చుట్టూ 50కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ ఆ సీసీ కెమెరాల్లో ఆగడాలు దృశ్యాలు రికార్డు అవుతున్నా సరైన సమయంలో ఫిర్యాదు చేయకపోవడంతో పోకిరి బాబులు రెచ్చి పోతున్నారు. భక్తులు ఫిర్యాదు చేస్తే తప్ప ఇటువంటి ఘటనలు వెలుగు చూడటం లేదు. ఆలయాల వద్ద ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వ్యక్తుల పట్ల పోలీసులు నామమాత్రపు చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి కామంటున్నారు భక్తులు.