Chinna Jeeyar Swami: ముచ్చింతల్‌‌లో వైభవంగా చిన్నజీయర్‌స్వామి తిరునక్షత్ర మహోత్సవాలు

|

Nov 01, 2024 | 9:10 PM

ముచ్చింతల్‌లో త్రిదండి చిన్న జీయర్‌ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ప్రారంభయ్యాయి. ఈ మహోత్సవాలు నేటి నుంచి 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ చిన్న జీయర్‌ స్వామి పురస్కార సభ నిర్వహించారు.

Chinna Jeeyar Swami: ముచ్చింతల్‌‌లో వైభవంగా చిన్నజీయర్‌స్వామి తిరునక్షత్ర మహోత్సవాలు
Chinna Jeeyar Swami
Follow us on

ముచ్చింతల్‌లో త్రిదండి చిన్న జీయర్‌ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ప్రారంభయ్యాయి. ఈ మహోత్సవాలు నేటి నుంచి 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇవాళ చిన్న జీయర్‌ స్వామి పురస్కార సభ నిర్వహించారు. ఈ సభలో మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, అహోబిలజీయర్‌స్వామి, దేవనాదజీయర్‌స్వామి, డాక్టర్‌ విద్వన్మణి సత్కార గ్రహీత డాక్టర్‌ శ్రీమాన్‌ బేతబోలు రామబ్రహ్మంస్వామి, డాక్టర్‌ సముద్రాల రంగరాజరామానుజులచార్యులు, అద్దంకి శ్రీనివాసాచార్యులస్వామివారు పాల్గొన్నారు. 31వ జీయర్‌ పురస్కార గ్రహీత శ్రీమాన్‌ ఖగేంద్రాచార్యులను.. మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సత్కరించి పురస్కారం అందజేశారు.

పుస్తకాన్ని చూడకుండా గ్రంథాన్ని చదివే అలవాటు దక్షిణ భారతదేశానికే ఉందన్నారు త్రిదండి చిన్నజీయర్‌స్వామి. ఈ క్రమంలోనే.. శ్రీమాన్‌ ఖగేంద్రాచార్యులవారు గ్రంథాన్ని కంఠస్తం చేసి.. దానిపై విలక్షణమైన కృషి చేశారని చెప్పారు. ఉత్తర భారతంలో పుస్తకం చూడకుండా చదివే అలవాటు లేనప్పటికీ.. చాలా మంది వేద పండితులు.. సంస్కృతంలో దిట్టలైన మహనీయులు ఉన్నారన్నారు చిన్నజీయర్‌స్వామి.

వీడియో చూడండి..

ఇక, డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకి చిన్నజీయర్‌ స్వామి వారు మంగళాశాసనాలు అందజేశారు. ఈ సందర్భంగా.. త్రిదండి చిన్నజీయర్‌స్వామివారి తిరునక్షత్ర మహోత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు. తప్పిపోయినమార్గంలో ఉన్న మనల్ని సన్మార్గంలో నడిపేందుకు చిన్నజీయర్‌స్వామివారు చేస్తున్న కృషి మరువలేదని కొనియాడారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..