BVS: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్న భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్..

|

Apr 12, 2022 | 9:14 PM

తెలంగాణ(Telangana) రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది ఈ మేరకు భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్(BVS) సంస్థ తెలంగాణ లో 200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది...

BVS: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్న భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్..
Ktr
Follow us on

తెలంగాణ(Telangna) రాష్ట్రానికి మ‌రో భారీ ప్రాజెక్ట్ రానుంది. హైద‌రాబాద్‌లో భార‌త్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(BVS) సంస్థ జీనోమ్ వ్యాలీలో 200 కోట్ల రూపాయ‌ల‌తో టీకాల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ఈ మేర‌కు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్‌.. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌లశాఖ మంత్రి కేటీఆర్‌(KTR)ను ప్రగ‌తి భ‌వ‌న్‌లో క‌లిసి ఈ విష‌యాన్ని ప్రక‌టించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చినందుకు ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్‌కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఈ చ‌ర్యతో ప్రపంచంలోనే వ్యాక్సిన్ హ‌బ్‌గా హైద‌రాబాద్ న‌గ‌రం త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకుంద‌ని కేటీఆర్ తెలిపారు.

సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు వ్యాపారవేత్తలకు స్వర్గధామంగా మారింది. పలు కంపెనీలు, సంస్థలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయి. హైదరాబాద్‌ శివారులో భారత్‌బయోటెక్‌, ఇతర ఫార్మాకంపెనీలు ప్రపంచదృష్టిని ఆకర్షించాయి. కరోనా కష్టకాలంలో భారత్‌ బయోటెక్‌ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను తయారు చేసి రికార్డు సృష్టించింది. దాంతోపాటు ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ పేరుగాంచింది. అంతేకాదు రియల్‌ఎస్టేట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ఇక సర్కార్‌ కొత్తగా తీసుకొచ్చిన టీఎస్‌ ఐపాస్‌ పాలసీ తీసుకొచ్చింది. ఇది పెట్టుబడిదారులకు ఎంతో ఉపయోగపడుతోంది. కంపెనీల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించడమే ఈ పాలసీ ఉద్దేశం. కేవలం 15 రోజుల్లో పర్మిషన్‌ ఇస్తుండటంతో దిగ్గజ కంపెనీలు తెలంగాణవైపు చూస్తున్నాయి.

Read Also.. Hyderabad: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. గంజాయి అక్రమ రవాణాదారునికి 20 ఏళ్ల జైలుతో పాటు..