Hyderabad: హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..

|

Jul 27, 2024 | 9:40 AM

ఇటీవల హైదరాబాద్‌లో గంజాయి వాడకం ఎక్కువుతోంది. ఇతర రాష్ట్రాల చెందిన కొందరు హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. మొన్నటి మొన్న గండి మైసమ్మ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే....

Hyderabad: హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..
Hyderabad
Follow us on

హైదరాబాద్‌లో గంజాయి గుప్పుమంటోంది. పోలీసులు ఎన్ని రకాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నా గంజాయి వినియోగం మాత్రం తగ్గడం లేదు. అరెస్ట్‌లు చేస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నా నేరస్థులు మాత్రం రెచ్చిపోతున్నారు. దర్జాగా గంజాయి రవాణ చేస్తున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి దందా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా రూ. 50 వేల విలువ చేసే గంజాయిను పోలీసులు పట్టుకున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో గంజాయి వాడకం ఎక్కువుతోంది. ఇతర రాష్ట్రాల చెందిన కొందరు హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. మొన్నటి మొన్న గండి మైసమ్మ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా చోట గంజాయి సరఫరా జరగడం ఆందోళన కలిగించింది. తాజాగా బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కూడా గంజాయి పట్టుకున్నారు పోలీసులు.

 

వివరాల్లోకి వెళితే.. అస్సాం రాష్ట్రానికి చెందిన జై నుద్దీన్ అనే వ్యక్తి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాజహాన్ నగర్ లో ఉంటూ స్థానికంగా ఉన్న కొందరు యువకులతో పాటు విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్నాడు. ఈ సమయంలో సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహిచిన పోలీసులు జైనుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అస్సాం నుంచి గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజా కొనుక్కొని షాజహాన్ కాలనీలోని వ్యక్తులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. అయితే విషయం తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు నిందితున్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 50 వేల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితుడుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..