Hyderabad: మారణాయుధాలతో ఎంపీ టీజీ వెంకటేష్ ముఠా హల్‌చల్.. బంజారాహిల్స్‌లో 62 మంది అరెస్ట్..

Rayalaseema gang HulChul in Banjara Hills: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌.. ఆ ఏరియాలో గజాల స్థలమున్నా అతను శ్రీమంతుడే. అలాంటి కాస్ట్‌లీ భూములపై రాయలసీమకు చెందిన ఓ బడా నేత సోదరుడి కన్ను పడింది.

Hyderabad: మారణాయుధాలతో ఎంపీ టీజీ వెంకటేష్ ముఠా హల్‌చల్.. బంజారాహిల్స్‌లో 62 మంది అరెస్ట్..
Hyderabad

Edited By:

Updated on: Apr 18, 2022 | 12:52 PM

Gang HulChul in Banjara Hills: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌.. ఆ ఏరియాలో గజాల స్థలమున్నా అతను శ్రీమంతుడే. అలాంటి కాస్ట్‌లీ భూములపై ఏపీలోని కర్నూలుకు చెందిన ఓ బడా నేతతోపాటు, ఆయన సోదరుడి కన్ను పడింది. ఏకంగా వంద కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే మ్యాటర్‌ (Hyderabad) ఖాకీల చెవిన పడటంతో.. కబ్జా యత్నం బెడిసికొట్టింది. 63 మందికి పైగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. మరికొందరు అక్కడినుంచి పరారయ్యారు.

ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్‌ పార్క్‌కి.. 2005లో 2.5 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ ప్లేస్‌లో కొంత నిర్మాణాలు చేపట్టారు. మిగతా స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలంపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్‌, ఆయన సోదరుడు టీజీ విశ్వప్రసాద్‌ కన్నుపడింది. ఆ స్థలం మాదంటూ రౌడీలను మోహరించి కబ్జాకు యత్నించాడు.

ఈమేరకు ఆదివారం అర్ధరాత్రి ఏకంగా 90మంది రౌడీలను మోహరించారు.. అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై మారణాయుధాలతో దాడి చేయించాడు. వాళ్ల అడ్డు తొలగించుకుని ఖాళీ స్థలంలో బోర్డు పాతేయాలని డిసైడ్ అయ్యాడు. డీసీఎం వ్యాన్లు, జీప్‌లు.. రౌడీల హంగామాతో అర్దరాత్రి పెద్ద దుమారం చెలరేగింది.

ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్, టీజీ విశ్వప్రసాద్‌, వీవీఎన్‌ శర్మ, సుభాష్‌, పులిశెట్టి, మిథున్ కుమార్‌ అల్లు సహా పలువురిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ల్యాండ్ కబ్జాలో అదుపులోకి తీసుకున్న వాళ్లను కొద్దిసేపటి క్రితం వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Also Read:

AP Crime News: డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 15 మందికి గాయాలు..

Ayyannapathrudu: మాజీ మంత్రి అయన్న పాత్రుడు సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టును ఢీకొన్న స్కార్పియో.. నలుగురి మృతి..