Telangana: గన్‌ కావాలా నాయనా! తెలంగాణలో అంగట్లో సరుకుల్లా తుపాకులు..

ఒకే రోజు.. రెండు ఘటనలు.. 9 బుల్లెట్లు. ఫైనల్‌ రిజల్ట్‌ ఈజ్‌ 'రెండు హత్యలు'. తెలంగాణలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి గుబులు రేపుతోంది. పాత కక్షలు కావొచ్చు, ఆధిపత్యపోరు కావొచ్చు, సెటిల్‌మెంట్లు, ఇతరత్రా పంచాయితీలు కావొచ్చు. అన్నిటికీ గన్స్‌తోనే పరిష్కారం కోరుకుంటున్నారు.

Telangana: గన్‌ కావాలా నాయనా! తెలంగాణలో అంగట్లో సరుకుల్లా తుపాకులు..
Telangana Gun Violence

Updated on: Jul 16, 2025 | 9:45 PM

గన్స్‌ ఎక్కడ దొరుకుతాయ్. బాగా పనిచేసే పిస్టల్స్‌ ఎక్కడ లభిస్తాయ్. రేటు ఎంత ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ తుపాకీ ఎంత పలుకుతుంది. ఈ డిస్కషన్‌కి కేరాఫ్‌ అడ్రస్… జైళ్లు. తెలంగాణలోని పాత నేరస్తులు, కొత్తగా పట్టుబడుతున్న ఉత్తరాది ముఠాలు.. ఈ ఇద్దరూ ఏకం అయ్యే ప్లేస్‌ జైలు. పైగా బోలెడంత డిమాండ్‌ ఉంది బయటి మార్కెట్లో. సో, జైళ్లలో మాట్లాడుకుంటున్నారు, బయటికొచ్చి తుపాకులు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు ఘటనలు చూశాక… అవి కూడా గన్స్‌తోనే ప్రాణాలు తీశారని తెలిశాక.. సిటీలో భయం స్టార్ట్‌ అయింది. అసలు ఈ గన్‌కల్చర్‌ ఏ స్థాయిలో వేళ్లూనుకుని ఉందోనన్న ఆందోళన మొదలైంది. ఒకే రోజు.. రెండు ఘటనలు.. 9 బుల్లెట్లు. ఫైనల్‌ రిజల్ట్‌ ఈజ్‌ ‘రెండు హత్యలు’. తెలంగాణలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి గుబులు రేపుతోంది. పాత కక్షలు కావొచ్చు, ఆధిపత్యపోరు కావొచ్చు, సెటిల్‌మెంట్లు, ఇతరత్రా పంచాయితీలు కావొచ్చు. అన్నిటికీ గన్స్‌తోనే పరిష్కారం కోరుకుంటున్నారు. హైదరాబాద్‌ మలక్‌పేటలో శాలివాహన పార్కు దగ్గర సీపీఐ నాయకుడు కేతావత్‌ చందురాథోడ్‌ను పాయింట్‌బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చి చంపడమే ఇందుకు ఉదాహరణ. భూపోరాటాల్లో చురుగ్గా ఉండడం వల్లే అని కొందరు, ఖాళీ స్థలాల్లో పూరిళ్లు వేయిస్తున్నందుకు ప్రత్యర్థులే హత్య చేశారని మరికొందరు చెబుతున్నారు. కారణం ఏదైనా.. తుపాకీతో కాల్చి చంపడం ఇక్కడ మెయిన్‌ పాయింట్‌.. ఓవైపు చందూరాథోడ్‌ను అందరి ముందూ కాల్చి చంపారన్న బ్రేకింగ్‌...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి